టి20ల్లోనే ఫాస్టేస్ట్ డెలివరీ.. ఉమ్రాన్ మాలిక్ అరుదైన రికార్డ్?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్లో వేగవంతమైన బౌలింగ్ కి కేరాఫ్ అడ్రెస్ గా కొనసాగుతున్నాడు ఉమ్రాన్ మాలిక్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన అద్భుతమైన బౌలింగ్ తోనే అందరి దృష్టిని ఆకర్షించి టీమ్ ఇండియాలో చోటు సంపాదించుకున్నాడు. కాగా ఇదే స్పీడ్ బౌలింగ్ తో ప్రస్తుతం ప్రత్యర్థులను సైతం భయపెడుతూ దూసుకుపోతున్నాడు ఉమ్రాన్ మాలిక్. ఇప్పటికే 151 కిలోమీటర్లకు పైగా బౌలింగ్ వేగంతో అందరిని ఆశ్చర్యపరిచిన ఉమ్రాన్ మాలిక్.. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో మరోసారి తన వేగంతో దుమ్ము రేపాడు.

 ఇప్పటికే శ్రీలంకతో జరిగే టి20 సిరీస్ లో ఏకంగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ పేరిట ఉన్న అత్యధిక వేగవంతమైన బంతి రికార్డును బ్రేక్ చేస్తాను అంటూ ఉమ్రాన్ మాలిక్ చెప్పుకొచ్చాడు అనే విషయం తెలిసిందే. అయితే ఉమ్రాన్ మాలిక్ చెప్పింది సాధించేలాగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇటీవలే వంఖండే స్టేడియంలో కళ్ళు చిదరే స్పీడ్ తో బౌలింగ్ చేసి లంక క్రికెటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఏకంగా గంటకు 155 కిలోమీటర్ల వేగంతో ఉమ్రాన్ మాలిక్ బంతులు విసరాడు అని చెప్పాలి. ఇలా అత్యంత వేగవంతమైన బంతికి లంకా కెప్టెన్ దాసున్ షనక ఔట్ చేశాడు.

 27 బంతుల్లోనే 45 పరుగులు చేసి టార్గెట్ సాధించే దిశగా దూసుకు వెళ్తున్న దాసున్ షనక ను ఇక తన వేగవంతమైన బంతితో బోల్తా కొట్టించి వికెట్ దక్కించుకున్నాడు అని చెప్పాలి. అయితే ఓ ఇండియన్ బౌలర్ అంతర్జాతీయ టి20లో 155 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేయడం క్రికెట్ చరిత్రలో ఇది తొలిసారి అని చెప్పాలి. ఇలా ఇండియన్ టీ20 లలో ఫాస్టస్ట్  డెలివరీ గా ఉమ్రాన్ మాలిక్ వేసిన బంతి రికార్డు సృష్టించింది. అయితే ఇక ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసినా ఉమ్రాన్ మాలిక్ అసలంక వికెట్ను కూడా తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: