సచిన్ కు చేరువగా జో రూట్.. రికార్డ్ బ్రేక్ చేస్తాడా?

praveen
ప్రపంచ క్రికెట్లో లెజెండ్లకే లెజెండ్ గా కొనసాగుతున్న భారత  మాజీ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి రోజులు గడుస్తున్న ఇంకా సచిన్ సృష్టించిన రికార్డులు మాత్రం పదిలంగానే ఉన్నాయి అంటే ఇక ఆ రికార్డులు ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోవచ్చు అని చెప్పాలి. 17 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ తన ఆట తీరుతో మాస్టర్ బ్లాస్టర్ గా మారిపోయాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు చేశాడు సచిన్ టెండూల్కర్.

 అంతేకాదు టెస్ట్ ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా సచిన్ టెండూల్కర్ పేరిటే ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పుడిప్పుడే ఈ తరం క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను తిరగ రాసేందుకు కాస్త దగ్గరికి వస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టడానికి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ముందున్నాడు. సచిన్ టెండూల్కర్ అతని కెరియర్లో టెస్టుల్లో 15 వేల 921 పరుగులు చేశాడు. 200 టెస్ట్ మ్యాచ్లలో 329 ఇన్నింగ్స్ లో ఈ పరుగులు సాధించాడు.

 కాగా ఇప్పటికి కూడా అంతర్జాతీయ క్రికెట్ లో టెస్ట్ ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిటే ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు సచిన్ రికార్డుకు ఎంతో చేరువుగా వస్తున్నాడు ఇంగ్లాండు మాజీ కెప్టెన్ జో రూట్. గత రెండేళ్ల నుంచి ఎంతో నిలకడగా ఆడుతూ భారీగా పరుగులు చేస్తున్నారు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో 10629 పరుగులు కొనసాగుతున్నాడు జో రూట్. సచిన్ రికార్డు బద్దలు కొట్టడానికి అతనికి 5293 పరుగులు కావాలి. అయితే ఈ ఏడాది మాత్రం రికార్డు బద్దలు కొట్టడం కష్టం. ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్లో ఒక క్యాలెండర్ ఇయర్లో  ఏ ఆటగాడు  2000 పరుగులు ఇప్పటివరకు చేయలేదు. అలాంటిది జో రూట్ 5293 పరుగులు కావాలి. కాగా సచిన్ రికార్డు  కొట్టాలంటే జో రూటుకి కనీసం మూడేళ్లయిన సమయం పడుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: