మహిళ ఐపీఎల్.. బీసీసీఐ కీలక ప్రకటన?

praveen
భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిసిసిఐ ఏం చేసినా కూడా అది ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్  గా మారిపోతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఎంతో మంది యువ ఆటగాళ్లకు సత్తా చాటెందుకు అవకాశం ఇస్తుంది అని చెప్పాలి  అంతేకాదు విదేశీ ఆటగాళ్లకు కూడా ఇక మంచి అనుభవాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇలా ఒక సాదాసీదా క్రికెట్ లీగ్ గా ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇక ఎప్పుడూ ప్రపంచ క్రికెట్లో ఒక దిగ్గజ లీగ్ గా ఎదిగింది అని చెప్పాలి.  ఇకపోతే దాదాపు 15 ఏళ్ళ నుంచి ఎంతో సక్సెస్ఫుల్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తుంది బీసీసీఐ. అయితే ఇక ఇప్పుడు మహిళల క్రికెట్ ను కూడా ప్రోత్సహించేందుకు మహిళల ఐపిఎల్ నిర్వహించేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. అయితే మహిళల ఐపీఎల్ ఇక ఈ ఏడాది జరగనుంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించి అన్ని రకాల సన్నహాలను చేస్తుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి.
 ఈ క్రమంలోనే ఈ ఏడాది నుంచి ప్రారంభం కాబోతున్న మహిళల ఐపీఎల్ కోసం ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇటీవల టెండర్లను ఆహ్వానించింది అన్నది తెలుస్తుంది. టెండర్ల ప్రక్రియతో ఇక ఈ లీగ్ లోని ఓ జట్టును సొంతం చేసుకునేందుకు నిర్వహణ బాధ్యతలను తీసుకోవాలని సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు ఇటీవల బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఈనెల 21 వరకు కూడా గడువు ఇస్తున్నట్లు చెప్పుకు వచ్చింది. ఆసక్తి ఉన్నవాళ్లందరూ ఐదు లక్షలు చెల్లించి ఇక టెండర్లకు దరఖాస్తు చేసుకోవాలి అంటూ సూచించింది. దరఖాస్తులు అన్నిటిని పరిశీలించిన తర్వాత ఇక వేలంలో పాల్గొనేవారిని ప్రకటిస్తాము అంటూ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: