ఎంతకీ పెళ్లి కావట్లేదని.. ఆ యువకుడు ఏం చేశాడో తెలుసా?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే . ఇక పెళ్లి అనే బంధంతో దాంపత్య బంధం లోకి అడుగుపెట్టి వందేళ్లు ఎంతో సంతోషంగా భాగస్వామితో బ్రతకాలని ప్రతి ఒక్కరు ఆశ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే అర్థం చేసుకునే.. తమ అభిరుచులను గౌరవించే భాగస్వామి దొరికితే అంతకంటే ఇంకేం కావాలని యువతి యువకులు కోరుకుంటూ ఉంటారు అని చెప్పాలి.

 ఇటీవల కాలంలో యువత మాత్రం ఎందుకొ పెళ్లి విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కెరియర్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని భావిస్తూ.. చివరికి కాస్త వయస్సు పెరిగే వరకు కూడా ఆగుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక కాస్త వయసు మీద పడిన తర్వాత కూడా పెళ్లికి ఇప్పుడేం తొందర వచ్చింది అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం పెళ్లి కావడం లేదు అన్న కారణంతో మనస్థాపం చెంది చివరికి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. ఏకంగా పెళ్లి కావడం లేదని మనస్థాపంతో యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

 తొర్రూరు మండలంలోని ఫతేపురంలో ఈ ఘటన వెలుగు చూసింది. కొత్తగట్ల కేదారి అనే 25 ఏళ్ళ యువకుడు రెండు సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక ఎన్ని పెళ్లి సంబంధాలుకు వెళ్లిన సెట్ కావడం లేదు. స్నేహితులందరికీ పెళ్లిళ్లు అవుతున్నాయని తనకు మాత్రం పెళ్లి కావడం లేదని ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. ఇక ఇటీవలే మనస్థాపనతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఇంటికి చేరుకుగా.. అప్పటికే కేదారి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: