ముంబై పంట పండింది.. బేస్ ప్రైస్ కి కొన్న ప్లేయర్ అదరగొడుతున్నాడు?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఏ ఫ్రాంచైజీకి  సాధ్యం కాని రీతిలో ఏకంగా 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఏకైక జట్టుగా కొనసాగుతుంది. రోహిత్ శర్మ సారధ్యంలో ప్రతి ఏడాది ఎంతో విజయవంతంగా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంటుంది ముంబై ఇండియన్స్. అయితే మినీ వేలం సమయంలో ఇక ఏ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలి అనే విషయంలో కూడా ముంబై ఇండియన్స్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అన్న విషయం ఇప్పటికే ఎంతోమంది ప్లేయర్ల విషయంలో నిజమైంది అన్న విషయం తెలిసిందే.

 ఎంతో ఆచితూచి వ్యవహరిస్తూ టాలెంట్ ఉన్న ప్లేయర్లను మాత్రమే జట్టులోకి తీసుకుంటూ ఉంటుంది. ఇక ఇలా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు అదిరిపోయే ప్రదర్శన చేస్తూ జట్టుకు టైటిల్ అందించడంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మరో ఆటగాడు విషయంలో కూడా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ప్లాన్ సక్సెస్ అయ్యింది అన్నది తెలుస్తుంది. ఇటీవల ఏకంగా 2023 మినీ వేలంలో ఫేసర్ రిచర్డ్ సన్ ను ముంబై ఇండియన్స్ అతని బేస్ ధర 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ముందుగా అతని కొనుగోలు చేసేందుకు ఏ రాంచైజీ  ఆసక్తి కనపరచలేదు. కానీ ముంబై జట్టు మాత్రం అతన్ని జట్టులోకి తీసుకుంది.

 అదేంటి ఎవ్వరూ పట్టించుకోని ఆటగాడిని ముంబై తీసుకుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆటగాడే తన బౌలింగ్ తో  నిప్పులు చేరుకుతున్నాడు. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ అదరగొడుతున్నాడు. బిగ్ బాష్ లీగ్ లో భాగంగా తన బౌలింగ్ తో నిప్పులు చెరుగుతున్నాడు. ఇటీవల ఓ మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో 25 పరుగులు ఐచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. బిగ్ బాష్ టోర్నీలో రెండవ విజయవంతమైన బౌలర్గా  ఉన్నాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లలో 12 వికెట్లు పడగొట్టాడు.దీనిబట్టి ఇక ముంబై ముందుగానే అతని టాలెంట్ ని  అంచనా వేసి వ్యూహాత్మకంగా వ్యవహరించింది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: