వైరల్ : బైక్ స్టార్ట్ చేసేందుకు.. ధోని ఎంత ఇబ్బంది పడ్డాడో?
కాగా మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన పాత ఫోటోలు వీడియోలు కూడా అప్పుడప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది. వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని ఏకంగా ఒక బైక్ ని స్టార్ట్ చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉండడం చూడవచ్చు. సాధారణంగానే మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్స్, కార్స్ అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం. ఇప్పటికే ధోని గ్యారేజీలో ఎన్నో రకాల బైక్లు కార్లు ఉన్నాయి అని చెప్పాలి.
అప్పుడప్పుడు తన గ్యారేజ్ లో ఉన్న బైక్లను తీసుకొని సరదాగా బయటికి వెళ్లడం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు మహేంద్ర సింగ్ ధోని. ఈ క్రమంలోనే ధోని కి సంబంధించిన ఒక పాత వీడియో ఇక ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఇందులో భాగంగా ఒక బైక్ నడపాలి అనుకున్న మహేంద్ర సింగ్ ధోని ఆ బైక్ స్టార్ట్ చేయడానికి కిక్ కొడుతూ ఎంతో కష్టపడి పోతున్నాడు. కానీ అది స్టార్ట్ కాలేదు. ఇక ఎంతోసేపు బైక్ ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించిన ధోని చివరికి బైక్ ని స్టార్ట్ చేయకుండానే కాళ్లతో ముందుకు నెడుతూ తీసుకు వెళుతూ ఉండడం ఈ వీడియోలో కనిపిస్తోంది.