బీసీసీఐ నయా ప్లాన్.. కోచ్ ద్రావిడ్ పై వేటు.. అలాంటి వ్యక్తి కోసం అన్వేషణ?

praveen
ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బలిలోకి దిగిన టీమిండియా జట్టు కేవలం సెమీఫైనల్ వరకు వెళ్లి ఇంటి బాట పట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక టి20 వరల్డ్ కప్ లో వైఫల్యం నేపథ్యంలో టీమ్ ఇండియా పై తీవ్రస్థాయిగా విమర్శలు వచ్చాయి. అదే సమయంలో బీసీసీఐకి కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ కూడా ఎంపిక అయ్యాడు అన్న విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐలో సమూలమైన మార్పులకు సిద్ధమయ్యాడు రోజర్ బిన్ని.

 ఇక గత కొంతకాలం నుంచి ఎంతోమంది సీనియర్ ప్లేయర్లకు తరచూ విశ్రాంతి ప్రకటిస్తూ ఉండడం ఇక యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించడం.. అదే సమయంలో జట్టులో గందరగోళ పరిస్థితి నెలకొనడం విషయంపై విమర్శలు వస్తున్నాయ్. ఈ క్రమంలోనే జట్టు సెలక్షన్ కమిటీ పై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఇక ప్రస్తుతం రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను కూడా మార్పు చేయబోతుంది అన్నప్రచారం ఉంది. అదే సమయంలో ప్రస్తుతం భారత జట్టుకి హెడ్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ను సైతం తప్పించాలని యోజనలో బీసీసీఐ పెద్దలు ఉన్నారట.

 రాహుల్ ద్రావిడ్ కోచింగ్ లో జట్టులో తరచూ మార్పులు రావడం కారణంగానే ఇక ఆసియా కప్ టి20 వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలలో టీమిండియా ఘోర పరాభవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే కోచ్ గా రాహుల్ ద్రావిడ్ సేవలను వదిలించుకోవాలని భావిస్తుందట బీసీసీఐ. ఇక విదేశీ అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై క్రికెట్ అడ్వైజరీ కమిటీ త్వరలో తుది నిర్ణయం తీసుకోబోతుంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాకు కొత్త హెడ్ కోచ్ గా రాబోయేది ఎవరు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: