మహమ్మద్ షమీ బుమ్రాలా ప్రొఫెషనల్ కాదు : దినేష్ కార్తీక్

praveen
భారత జట్టులో స్టార్ ఫేసర్ లుగా కొనసాగుతున్న మహమ్మద్ షమీ, బుమ్రా లేకుండానే ఇటీవల టీమిండియా జట్టు బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ముగించుకుంది అన్న విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు ఇక ఈ టెస్ట్ సిరీస్ లో ఘనవిజయాన్ని సాధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోల్లో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది టీం ఇండియా జట్టు. కాగా గత టి20 వరల్డ్ కప్ నుంచి బుమ్రా వెన్న నొప్పి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు అనే విషయం తెలిసిందే. ఇక మహమ్మద్ షమీ భుజంగాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.

 అయితే ఇక ఇప్పుడు కొత్త ఏడాదిలో కూడా నిర్విరామంగా క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతుంది టీమిండియా జట్టు. ఈ క్రమంలోనే సీనియర్ బౌలర్లు బుమ్రా, షమీ మళ్ళీ తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తారు అనే విషయం పైన చర్చ జరుగుతుంది. ఇక ఇటీవల ఇదే విషయంపై మాట్లాడిన వెటరన్  బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షమీ కంటే ముందుగా బుమ్రా జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. శమీ కంటే బుమ్రా గాయం నుంచి త్వరగా కోలుకొని తిరిగి వస్తాడని.. ఎందుకంటే అతను ప్రొఫెషనల్ ప్లేయర్. తుపాకీలో తూటాలాగా తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత టెస్ట్ కంటే ముందు కొన్ని వన్డే మ్యాచ్లో ఆడాలి. అలా ఆడితేనే అతను శరీరం పని ఒత్తిడిని తట్టుకునేందుకు సిద్ధపడుతూ ఉంటుంది అంటూ చెప్పవచ్చాడు దినేష్ కార్తీక్.

 అయితే మహమ్మద్ షమీ గురించి మాత్రం కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే అతను బుమ్రా లాగా ప్రొఫెషనల్ కాదు. కొంతకాలంగా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా భారత జట్టు నేషనల్ క్రికెట్ అకాడమీ తమను తాము సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ అభిప్రాయపడ్డాడు. ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఇక కొంతకాలం పాటు ఫిట్ గా ఆటగాళ్లు ఉండేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలంటూ దినేష్ కార్తీక్ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk

సంబంధిత వార్తలు: