గొంతులో ఇరుక్కున్న జలగ.. చివరికి 15 రోజుల తర్వాత?

praveen
సోషల్ మీడియా అంటేనే ఎన్నో వింతలు విశేషాలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతిరోజు కూడా సరికొత్త, విచిత్రమైన విషయాలు కూడా వెలుగులోకి వస్తూ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ లో తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనల గురించి తెలిసి ఆశ్చర్య పోవడం నేటిజన్ల వంతు అవుతుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల కాలంలో డాక్టర్ల దగ్గరికి వస్తున్న చిత్ర విచిత్రమైన కేసులు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన మరొకటి వెలుగులోకి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఇటీవల బెంగాల్ రాష్ట్రంలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఒక వ్యక్తి గొంతులో జలగా ఇరుక్కుపోయింది. ఒకటి కాదు రెండు కాదు 15 రోజులపాటు జలగ గొంతులోనే ఉండిపోయింది అని చెప్పాలి. దీంతో అతను డాక్టర్ల దగ్గరికి పరుగులు పెట్టాడు. ఇక డాక్టర్లు సైతం గొంతులో జలగ బ్రతికే ఉండడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు అని చెప్పాలి. చివరికి ఎంతో కష్టపడి ఆపరేషన్ చేసి జలగన తొలగించారు. ఇక అతని ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదు అని చెప్పాలి. సజిన్ రాయ్ అనే 49 ఏళ్ల వ్యక్తి మెరిక్ లో ఉంటున్నాడు. అయితే 15 రోజుల క్రితం పర్వత ప్రాంతం వైపు వెళ్ళాడు

 దాహం వేయడంతో అక్కడే ఉన్న ఒక ఊట దగ్గరికి వెళ్లి అందులో ఉన్న నీరును తాగాడు. అయితే ఈ క్రమంలోనే ఊహించిన విధంగా ఇక ఆ నీటిలో ఉన్న జలగా అతను నీళ్లు తాగుతుండగా గొంతులోకి వెళ్లి ఇరుక్కుపోయింది. జలగ గొంతులోకి వెళ్లి ఇరుక్కుపోయిన నాటి నుంచి కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తగ్గిపోతుంది అని రెండు మూడు రోజులు వేచి చూసిన తగ్గకపోవడంతో ఆసుపత్రికి వెళ్ళాడు. ఇక పరీక్షలు చేసిన వైద్యులు గొంతులో జలగా ఉన్నట్లు గుర్తించి షాక్ అయ్యారు. చివరికి గంటన్నర పాటు శ్రమించి ఆపరేషన్ చేసి విజయవంతంగా జలగల తొలగించి అతని ప్రాణాలను కాపాడారు. ఇక తన ప్రాణాలను కాపాడిన వైద్యులకు సచిన్ రాయి కృతజ్ఞతలు తెలిపాడు అని చెప్పాలి. తమ 40 ఏళ్ల కెరియర్ లో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదు అంటూ డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: