కోహ్లీ అందులో కూడా నెంబర్ వన్.. ఫాన్స్ ఫుల్ హ్యాపీ?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే  ఇప్పటికే తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ దేశ విదేశాల్లో తన పాపులారిటీ అంతకంతకు పెంచుకుంటూ ఉన్నాడు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతంగా రాణిస్తూ ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. గత మూడేళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు కోహ్లీ. ఈ సమయంలో కోహ్లీ పని అయిపోయిందని ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎంతోమంది విమర్శలు చేశారు. కానీ అందరి నోళ్ళు మూయిస్తూ తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో దూసుకొచ్చాడు కోహ్లీ
.

 ఇక ఇప్పుడు మళ్లీ తన పాత స్టైల్ లోనే భారీగా పరుగుల వరద పారిస్తూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ అటు క్రికెట్లో రికార్డుల రారాజుగా కొనసాగుతూ ఉండడమే కాదు సోషల్ మీడియాలో పాపులారిటీ దృశ్యా కూడా మిగతా ప్లేయర్లతో పోల్చి చూస్తే కింగ్ గానే కొనసాగుతూ వున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో ఉన్న ఎంతో మంది స్టార్ ప్లేయర్లతో పోల్చి చూస్తే ఇక పాపులారిటీ దృశ్య ఎవరికి అందనంత దూరంలో ఉన్నాడు. ఇక ఎన్నో సంస్థల సర్వేల్లో కూడా కోహ్లీ అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవలే ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ నవంబర్ కు సంబంధించిన మోస్ట్ పాపులర్ ప్లేయర్ల లిస్టును ఇటీవలే రిలీజ్ చేసింది. ఇక ఇందులో కూడా కోహ్లీ అదరగొట్టాడు అని చెప్పాలి. భారత మాజీ కెప్టెన్ రన్ మిషన్ విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక అత్యంత పాపులారిటీ ఉన్న ప్లేయర్ల లిస్టులో రెండవ స్థానంలో మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని స్థానం సంపాదించుకున్నాడు. మూడో స్థానంలో ఫుట్బాల్ ప్లేయర్ రోనాల్డో, నాలుగవ స్థానంలో సచిన్, 5వ స్థానంలో రోహిత్ శర్మ, ఆరవ స్థానంలో మెస్సి, ఏడవ స్థానంలో హార్దిక్, ఎనిమిదవ స్థానంలో సూర్య కుమార్ యాదవ్, తొమ్మిదిలో పీవీ సింధు, పదవ స్థానంలో భారత ఫుట్బాల్ సునీల్ చెత్రి చోటు సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: