డబుల్ సెంచరీ బాదిన అజింక్యా రహానే... టెస్ట్ జట్టులోకి వస్తాడా !

VAMSI
ఇండియా దేశవాళీ టెస్ట్ టోర్నీ రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ లో భాగంగా రెండవ రౌండ్ మ్యాచ్ లు నిన్నటి నుండి ఆయా స్టేడియం లలో జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ముంబై మరియు హైదరాబాద్ జట్ల మధ్యన ముంబై లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేడియం లో జరుగుతున్నది. టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా ముంబై కు బ్యాటింగ్ అప్పగించింది. ముంబై మొదటి బ్యాటింగ్ లో భారీ స్కోర్ ను చేసి హైద్రాబాద్ ముందు ఛాలెంజింగ్ టోటల్ ను ఉంచింది. ముంబై జట్టు 127.2 ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 651 పరుగులు చేసింది.
ఇందులో ఓపెనర్ పృధ్వి షా (19) స్వల్ప స్కోర్ కే వెనుతిరగగా , మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి తన యొక్క చక్కని బ్యాటింగ్ స్కిల్స్ ను వాడుకుని  162 పరుగులు చేశారు. ఇందులో మొత్తం 27 ఫోర్లు మరియు 1 సిక్సు ఉన్నాయి. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఇపుడు ఇండియన్ టీం లో ఎంత కీలక ప్లేయర్ అన్నది తెలిసిందే. సూర్య ఫామ్ లో ఉన్నప్పటికీ రంజీలో ఆడి మరింతగా బ్యాటింగ్ లో రాణించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగాడు. అయితే సూర్య (90) తృటిలో సెంచరీ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. మరో మిడిల్ ఆర్డర్ బ్యాట్సమన్ సర్ఫరాజ్ ఖాన్ కూడా తన ఫామ్ ను కొనసాగిస్తూ సెంచరీ సాధించాడు.. సర్ఫరాజ్ 161 బంతుల్లో 126 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.
ఇక గతంలో టెస్ట్ లలో సరిగా రాణించక జాతీయ జట్టులో చోటును కోల్పోయిన అజింక్యా రహానే... హైద్రాబాద్ పై అద్భుతమైన డబుల్ సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చాడు. ఇతను 261 బంతులను ఎదుర్కొని 204 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ ను అందించాడు. మరి ఈ ఫామ్ ను ఇలాగే కొనసాగించి త్వరలోనే జాతీయ జట్టులోకి రావాలని ఆశిద్దాం. హైదరాబాద్ బౌలర్లలో కార్తికేయ మూడు వికెట్లు తీసుకోగా, శశాంక్ 2 వికెట్లు మరియు త్యాగరాజన్ 1 వికెట్ తీసుకున్నారు. బదులుగా హైదరాబాద్ తన మొదటి ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ 40 పరుగులు, రోహిత్ రాయుడు 72 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో షామ్స్ ములని అద్భుతంగా రాణించి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.      
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: