ఇక్కడ ధోని ఆటోగ్రాఫ్ ఉంది.. నేను సంతకం చేయలేను : ఇషాన్ కిషన్

praveen
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని రాష్ట్రం జార్ఖండ్ నుంచి భారత జట్టులోకి అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ ఇటీవల కాలంలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు అనే విషయం తెలిసిందే.  మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ ఏకంగా డబుల్ సెంచరీ చేసి చలరేగిపోయాడు. దీంతో అతని ప్రతిభకు ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు అని చెప్పాలి. ఇటీవలే మరోసారి ఇషాన్ కిషన్ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు అని చెప్పాలి.

 అయితే తన ఆట ద్వారా కాదు ఏకంగా తన ప్రవర్తన ద్వారా అభిమానుల మనుషులు గెలుచుకున్నాడు. ముఖ్యంగా ధోని అభిమానులందరూ కూడా ఇషాన్ కిషన్ పై ప్రశంసలు కురిపించేలా చేశాడు అని చెప్పాలి. ఇంతకీ ఏమైందంటే ఇటీవల వన్డే సిరీస్ ముగిసిన వెంటనే ఇండియాకు వచ్చిన ఇషాన్ కిషన్ రంజీ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్ జట్ట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇకపోతే ఇటీవల మ్యాచ్ ముగిసిన అనంతరం ఇషాన్ కిషన్ ఆటోగ్రాఫ్ కోసం ఎంతోమంది అభిమానులు వచ్చారు.

 అభిమానులందరికీ ఎంతో ఓపికగా ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ ఇచ్చిన ఇషాన్ కిషన్ ఒక అభిమానికి మాత్రం ఆటోగ్రాఫ్ ఇవ్వలేను అంటూ చెప్పడం అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా ఒక అభిమాని తన ఫోన్ కి వెనకాల ఆటోగ్రాఫ్ చేయాలని కోరగా.. అప్పటికే ఆ ఫోన్ వెనకాల మహేంద్ర సింగ్ ధోని సంతకం ఉంది. అయితే నువ్వు ధోని సంతకం మీద ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అడిగావు. కానీ నేను చేయలేను. ఎందుకంటే నేను మహేంద్రసింగ్ ధోని స్థాయికి చేరుకోలేదు. కాబట్టి ధోని  ఆటోగ్రాఫ్ కి కింద వైపున సంతకం పెడతా అంటూ ఇషాన్ కిషన్ చెప్పడం ధోని అభిమానులందరికీ కూడా ఆకర్షించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: