అతనో గుండు సున్నా. కోహ్లీతో పోల్చడం ఆపండి : కనేరియా

praveen
సాధారణం గా పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉన్న పాకిస్తాన్ జట్టును వారి సొంత దేశం లో ఓడించడం చాలా కష్టమైన పని అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. కానీ ఇటీవల ఎన్నో ఏళ్ల తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టు మాత్రం పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించడం గమనార్హం. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగం గా ఎక్కడ అటు పాకిస్తాన్కు అవకాశం ఇవ్వకుండా ఇంగ్లాండ్ అదరగొట్టింది అని చెప్పాలి.

 ఏకంగా టెస్ట్ క్రికెట్లో బజ్ బాల్ అనే కొత్త విధానాన్ని తీసుకువచ్చి ప్రత్యర్థులపై వీర విహారం చేస్తుంది ఇంగ్లాండ్ జట్టు.  దీంతో ఇక టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ జట్టు దూకుడు ముందు అటు పాకిస్తాన్ ఎక్కడ పోటీ ఇవ్వలేక పోయింది అని చెప్పాలి. అయితే సొంత దేశం లో టెస్ట్ సిరీస్ ని 3-0 తేడాతో ఓడిపోవడం తో ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ పై తీవ్ర స్థాయి లో విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానీష్ కనేరియా  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాన్ గుండు సున్నా అంటూ అభివర్ణించాడు. అభిమానులు ఇప్పటికైనా విరాట్ కోహ్లీ తో బాబర్ను పోల్చడం ఆపాలి. రోహిత్ విరాట్ అగ్రశ్రేణి ఆటగాళ్లు. వారితో సరిపోయే ఆటగాళ్లు అటు పాకిస్తాన్ జట్టు లోనే లేనే లేరు. అయితే మాటలు మాత్రం కోటలు దాటిపోయేలా ఉన్న ఫలితాలు మాత్రం శూన్యంగా ఉంటాయి.  కెప్టెన్ బాబర్ ఒక పెద్ద గుండు సున్నా. జట్టును నడిపించేంత సీన్  అతనికి లేనే లేదు. మరి ముఖ్యంగా టెస్ట్ టీంకు కెప్టెన్సీ వహించే అర్హత లేదు. ఇప్పటికైనా ఈగో పక్కన పెట్టి సర్ఫరాజ్ అహ్మద్ ను చూసి కెప్టెన్సీ గురించి నేర్చుకోవాలి అంటూ కనేరియా షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: