13 ఏళ్ళ కుర్రాడు "132 బంతుల్లో 401 పరుగులు".. సచిన్ రికార్డ్ హుష్ కాకి !

VAMSI
క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంచి పేరుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గల్లీ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు క్రికెట్ అంటే ఒక పిచ్చిగా దాన్ని కెరీర్ గా ఎంచుకుంటున్న వారు కోట్లలో ఉన్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో దేశం తరపున ఆడాలంటే చిన్నప్పటి నుండి క్రికెట్ లో తగిన ప్రావీణ్యత కలిగి ఉండాలి. స్కూల్ క్రికెట్ , క్లబ్ క్రికెట్ ఇలా చిన్న స్థాయి నుండి రాణిస్తూ వస్తేనే మంచి పేరు వస్తుంది. ఆ విదంగా మన ఇండియాలో స్కూల్ మరియు క్లబ్ క్రికెట్ లలో రాణించి అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ , సర్ఫరాజ్ ఖాన్, కోహ్లీ మరియు పృథ్వి షా లాంటి క్రికెటర్లు ఉన్నారు. వీరంతా కూడా చిన్న వయసులోనే ప్రపంచం గర్వించే ఇన్నింగ్స్ లు ఆడి తమ సత్తా చాటుకున్నారు.
తాజాగా వీరిలాగే ఇంకో చిచ్చర పిడుగు తనదైన అద్భుతమైన ఇన్నింగ్స్ తో అందరినీ తన వైపుకు తిప్పుకున్నాడు. గ్రేటర్ నోయిడా లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్ లో దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ మరియు ర్యాన్ ఇంటర్నేషనల్ అకాడమీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 13 సంవత్సరాలు ఉన్న తన్మయ్ సింగ్ అనే యువకుడు ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడాడు. తన్మయ్ తన ఇన్నింగ్స్ ద్వారా ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాడు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ నిర్ణీత ఓవర్లలో 656 పరుగులు చేసింది. ఈ స్కోర్ లో తన్మయ్ సింగ్ ఒక్కడే
401 పరుగులు చేసి మరోసారి అగ్ర క్రికెటర్లను గుర్తు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 38 సిక్సులు మరియు 30 ఫోర్లు ఉన్నాయి.
ఇక ఇదే జట్టుకు చెందిన మరో ఆటగాడు రుద్ర బిధురి 15 సిక్సులు మరియు 5 ఫోర్ల సహాయంతో 135 పరుగులు చేశాడు. కానీ ఇంత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ కేవలం 193 పరుగులకే ఆల్ అవుట్ అయి దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ కు 463 పరుగుల భారీ విజయాన్ని అందించింది. అయితే అంతకు ముందు సచిన్ మరియు కాంబ్లీ ల జోడీ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సచిన్ 326 పరుగులు చేయగా కాంబ్లీ మాత్రం పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ కుర్రాడు వీరిద్దరినీ దాటేశాడు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: