బంగ్లాదేశ్ పై విజయం.. వరల్డ్ కప్ సాధించిన టీమ్ ఇండియా?

praveen
గత కొన్నేళ్ల నుంచి టీమ్ ఇండియా అందుల క్రికెట్ జట్టు అద్భుతంగా రాణిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటికే రెండుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన జట్టుగా కొనసాగుతోంది. ఇక ఇప్పుడు మళ్లీ అందుల టి20 వరల్డ్ కప్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టి20 వరల్డ్ కప్ లో భాగంగా వరుస విజయాలతో దూసుకుపోయిన టీమిండియా జట్టు ఇక మరోసారి విశ్వ విజేతగా నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే భారత జట్టులోని ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఎంతోమంది క్రికెట్ నిపుణులు.

 ఇటీవల బెంగళూరు వేదిక జరిగే మూడో అందుల క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో బంగ్లాదేశ్ పై ఘన విజయాన్ని సాధించిన టీమిండియా జట్టు చివరికి వరల్డ్ కప్ అందుకుంది అని చెప్పాలి. అయితే ఈ విజయంతో వరుసగా మూడుసార్లు ప్రపంచ కప్ను ముద్దాడిన జట్టుగా ప్రత్యేకమైన రికార్డు స్పందించింది అని చెప్పాలి. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియా జట్టు ఏకంగా బంగ్లాదేశ్ పై 120 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకోవడం గమనార్హం.

 ఇకపోతే ఈ మ్యాచ్ లో టాస్ గెలుచుకుంది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే  మొదట బ్యాటింగ్ చేసింది అని చెప్పాలి. ఇక నిర్ణీత 20 ఓవర్ లలో రెండు వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోరు చేసింది టీమ్ ఇండియా జట్టు. ఇక ఇందులో సునీల్ రమేష్ 136 పరుగులతో చెలిరేగిపోగా.. అజయ్ కుమార్ రెడ్డి 100 పరుగులు చేసి అదరగొట్టాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు విఫలం అయినప్పటికీ కూడా  మిగతా బ్యాట్స్మెన్లు  మాత్రం అద్భుతంగా రాణించారు అని చెప్పాలి. ఆ తర్వాత భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: