BAN vs IND: ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం?

Purushottham Vinay
ఇక ఇండియా బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు ఛటోగ్రామ్‌లో జరుగుతోంది. నేడు మూడో రోజు. ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ ప్రస్తుతం మూడో రోజు 149 పరుగుల వద్ద మొత్తం 9 వికెట్లు కోల్పోయింది.ఇంకా ఈ క్రమంలో కుల్దీప్ 5 వికెట్లు తీసి, తన సత్తా చాటాడు. ఆ తరువాత అక్షర్ పటేల్ బంగ్లా చివరి వికెట్‌ను పడగొట్టాడు. దీంతో బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తం 150 పరుగులకు ఆలౌట్ అయింది.దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియాకు మొత్తం 254 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక మళ్లీ బ్యాటింగ్ చేయాలని టీమ్ ఇండియా నిర్ణయించుకుంది. బంగ్లాను ఫాలో-ఆన్ ఆడించకుండానే.. ఇండియా తన రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది.ఇండియాకి తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల ఆధిక్యం అనేది లభించింది. 25 పరుగుల వద్ద చివరి వికెట్‌గా మెహదీ హసన్ మిరాజ్ అవుటవ్వడం జరిగింది.


ఇక అక్షర్ అతనిని స్టంప్ చేసాడు. అలాగే ఖలీద్ అహ్మద్ నాటౌట్‌గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ ఐదు, మహ్మద్ సిరాజ్ మూడు, ఉమేష్ యాదవ్ ఇంకా అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల ఆధిక్యాన్ని పొందినప్పుడు టెస్టుల్లో ఫాలో-ఆన్ అనేది జరుగుతుంది. అప్పుడు ప్రత్యర్థికి ఫాలో-ఆన్ ని అందించవచ్చు. అయితే, ఫాలో ఆన్ ఆడించే నిర్ణయం ఆ జట్టు కెప్టెన్‌పైన ఆధారపడి ఉంటుంది.ఇంకా ఈ టెస్ట్ మ్యాచ్ కనుక గెలిస్తే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో ఇండియా మొత్తం 55.76% పాయింట్లను పొందుతుంది.ఇక ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా శ్రీలంకను అధిగమించి పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో ర్యాంక్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం శ్రీలంక అయితే 53.33% పాయింట్లతో ఉంది. అలాగే 75% పాయింట్లతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, ఇంకా 60% పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ ఓడిపోయి డ్రా అయితే ఇండియా ఇక నాలుగో ర్యాంకులోనే కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: