కోహ్లీ విషయంలో.. అదొక్కటే పరిగణలోకి తీసుకోను : ద్రవిడ్

praveen
ప్రపంచ క్రికెట్లో ఇప్పటికే ఎంతోమంది దిగ్గజాల రికార్డులను బ్రేక్ చేసి ఇక రికార్డుల విషయంలో ఎవరికి అందనంత దూరంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ . ఇక ప్రపంచ క్రికెట్లో అత్యున్నత ప్లేయర్గా నెంబర్వన్ బ్యాట్స్మెన్ గా కూడా హవా నడిపించాడు. అలాంటి విరాట్ కోహ్లీ దాదాపు మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు అన్న విషయం తెలిసిందే.  ఆ తర్వాత ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసి మునుపటి ఫామ్ లోకి వచ్చాడు. టి20 వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా నిలిచి ఎప్పటిలాగే తన హవా నడిపించాడు.

 ఇక మొన్నటికి మొన్న వన్డే ఫార్మాట్లో కూడా మరోసారి సెంచరీ చేసి భారాన్ని మొత్తం దించేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు అటు బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా విరాట్ కోహ్లీ భాగం అయి జట్టు విజయాల్లో కీలకపాత్ర వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. అయితే ఆటగాడు అన్నప్పుడు ప్రతి మ్యాచ్ లోను  పరుగులు చేయడం అనేది కష్టం అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల టెస్ట్ సిరీస్ లో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో విమర్శలు వస్తున్నాయి.

 ఈ క్రమంలోనే ఇక విరాట్ కోహ్లీ ఫామ్ గురించి రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. వచ్చే ఏడాది భారత వేదికగా జరిగే వన్డే  వరల్డ్ కప్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉండడం టీమిండియా కు కలిసి వచ్చే అంశం అంటూ కోచ్  చెప్పుకొచ్చాడు. తన ఉన్నత స్థాయి ఆటను మళ్లీ అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇక గత ఏడాది నుంచి కోహ్లీని ప్రత్యక్షంగా చూడటం ఎంతో అద్భుతంగా అనిపించింది. అయితే అంతకుముందు కూడా కోహ్లీ బ్యాటింగ్ అధ్వానంగా ఏమీ లేదు. ఎన్నో అర్ధ శతకాలు కూడా చేసాడు. కానీ సెంచరీ చేయలేదని కారణంతోనే ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఒక కోచ్గా కేవలం గణాంకాలను మాత్రమే పరిగణలోకి తీసుకోను.. ఆటతీరును మాత్రమే పరిశీలిస్తా అంటూ అటు ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: