అర్జున్.. సచిన్ కొడుకువి అన్న విషయం మర్చిపో?

praveen
ఇటీవల దేశవాళి టోర్నీ అయినా రంజీ ట్రోఫీలో భాగంగా భారత లెజెండ్రీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం మ్యాచ్ తోనే సెంచరీ తో చెలరేగిపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి. ఇన్నాళ్ల వరకు ఒక్కసారి కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోని అర్జున్ టెండూల్కర్.. ఇక ఇటీవల ఆడిన మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేశాడు. ముంబై తరపున రంజీల్లో ఎంపికైనప్పటికీ ఒక్కసారి కూడా తుది జట్టులోకి వచ్చి మ్యాచ్ ఆడలేదు. దీంతో అవకాశాల కోసం ముంబై నుంచి గోవా క్రికెట్ అసోసియేషన్కు మారాడు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్.

 రంజీ ట్రోఫీలో భాగంగా గోవా జట్టు తరఫున బరిలోకి దిగి రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసి అదరగొట్టాడు. దీంతో ఎంతో మంది నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ సైతం అర్జున్ టెండూల్కర్ పై ప్రశంసలు కురిపించాడు. కాగా గోవా జట్టుకు మారడానికి ముందే అర్జున్ టెండూల్కర్ యువరాజ్ తండ్రి యోగిరాజ్ దగ్గర  రెండు వారాలు పాటు శిక్షణ తీసుకున్నాడు.  ఈ విషయాలను యోగి రాజు పంచుకున్నాడు అని చెప్పాలి. రెండు వారాల క్రితమే నాకు యువరాజ్ నుంచి ఫోన్ వచ్చింది. డాడీ రెండు వారాలు పట్టు అర్జున్ టెండూల్కర్ చండీగఢ్లో ఉంటాడు. మీకు సమయం ఉంటే అతడికి శిక్షణ ఇవ్వాలి అంటూ సచిన్ కోరాడు అంటూ యువరాజ్ చెప్పాడు.

 సచిన్ కి నేను నో చెప్పలేను. ఎందుకంటే అతను నా పెద్ద కొడుకు లాంటివాడు. కానీ ఒక షరతు.. ట్రైనింగ్ ఎలా ఉంటుందో నీకు తెలుసు.. ఇందులో ఎవరు జోక్యం చేసుకోకూడదు అంటూ యువరాజ్ సింగ్ కి చెప్పాను అంటూ యోగిరాజ్ అన్నాడు. ఇక సచిన్ కొడుకు కావడంతో కోచ్ లు అతన్ని ఎంతగానో గారాబం చేశారని అర్థం చేసుకున్నాను.  నువ్వు నీ తండ్రి నీడ నుంచి బయటకు వచ్చేయ్. రానున్న 15 రోజులు నువ్వు సచిన్ కొడుకు అన్న విషయాన్ని మరిచిపో.. సచిన్ కొడుకులా కాకుండా నువ్వు ఒక కొత్త ఆటగాడిలా ఆడటానికి ప్రయత్నించు అంటూ అర్జున్ టెండూల్కర్ కు చెప్పాను అని యోగిరాజ్ ఇటీవల గుర్తు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: