25 ఏళ్ల క్రితం గొడవ.. రాహుల్ ద్రవిడ్ కు సారీ చెప్పిన మాజీ ప్లేయర్?

praveen
సాధారణంగా ప్రత్యర్థులుగా ఉన్న క్రికెటర్ల మధ్య అప్పుడప్పుడు చిన్నపాటి వివాదాలు చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక తమ జట్టును గెలిపించాలి అనే ఒత్తిడి మధ్య ఏకంగా ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు ఎంతోమంది. కానీ ఆ తర్వాత ఇక రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మాత్రం ఇలా తమ కెరియర్ లో ఉన్న చిన్నపాటి వివాదాలు చివరికి స్వీట్ మెమోరీస్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇకపోతే ఇలా రిటర్మెంట్ ప్రకటించిన తర్వాత ఏకంగా పాత గొడవలను గుర్తు చేసుకుని క్షమాపణలు చెప్పడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఎంతమంది మాజీ క్రికెటర్లు.

 ఇటీవల దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అలెన్ డోనాల్డ్ కూడా ఇలాగే టీమిండియా.. హెడ్ కోచ్ మాజీ ప్లేయర్ రాహుల్  ద్రావిడ్ కూ క్షమాపణ చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలో ఉండగా.. బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్ గా అలెన్ డోనాల్డ్.. ఇండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్  ఉన్నారు. ఇకపోతే ఇటీవలే రాహుల్ ద్రావిడ్ ను క్షమించమని కోరాడు అలెన్ డోనాల్డ్  అయితే వీరిద్దరి మధ్య ఎప్పుడు గొడవ జరిగిందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది ఇప్పుడు కాదు ఏకంగా 25 సంవత్సరాల క్రితం  జరిగిన ఘటన గురించి అలెన్ డోనాల్డ్ మాట్లాడుతూ.. ఆ ఘటన గురించి నేను మాట్లాడను.. ద్రవీడ్, సచిన్ మా బౌలర్లను బాదేస్తున్నారు.

 అప్పుడే నేను లైన్ దాటాను. నేను అతని ఏదో అని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాను. నిజానికి తాను అన్న మాటకే రాహుల్ ఆలోచనలో పడిపోయి వికెట్ కోల్పోయాడు. ఆరోజు నేను అన్న మాట నన్ను ఎంతగానో బాధించింది. అందుకే రాహుల్ ద్రావిడ్ ను ఇప్పటికీ  క్షమాపణ కోరుతున్నాను. అతను నా కోసం డిన్నర్ కు రావాలని కోరుతున్నాను అంటూ చెప్పిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను రాహుల్ ద్రవిడ్ చూసాడు. డోనాల్డ్ సారీ చెప్పడంపై ఇక ఏప్పటిలాగానే ఎలాంటి రియాక్షన్ లేకుండా చిన్న స్మైల్ ఇచ్చాడు రాహుల్ ద్రావిడ్. ఈ క్రమంలోనే డోనాల్డ్ రాహుల్ ద్రావిడ్ ను డిన్నర్ కు పిలవడంతో కచ్చితంగా వెళ్తాను. దానికోసం ఎదురు చూస్తున్నాను. ముఖ్యంగా బిల్లు అతడు కడతాను అంటే ఎందుకు వద్దంటాను అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: