ఇంతకీ ఎవరీ అభిమన్యు ఈశ్వరన్.. జట్టులోకి ఎలా వచ్చాడంటే?

praveen
ఇటీవల కాలంలో సీనియర్లు వరుసగా గాయాల బారిన పడుతున్న నేపథంలో టీమిండియాలోకి ఎంతో మంది యువ ఆటగాళ్లు అరంగేట్రం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. టీమ్ ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ దృశ్య ఇలా భారత జట్టులోకి ఎవరైనా కొత్త ఆటగాడు డెబ్యు చేశాడు అంటే చాలు అతని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

 ప్రస్తుతం భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ ఆడుతుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో కేఎల్ రాహుల్ సారధ్యంలో బరిలోకి దిగింది అన్న విషయం తెలిసిందే. అయితే రోహిత్ శర్మ గాయపడిన నేపథంలో అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ నూ జట్టులోకి ఎంపిక చేశారు సెలెక్టర్లు. అతను భారత జట్టు తరఫున అరంగేట్రం ఘటన చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అయితే అతనికి తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇకపోతే ఈ అభిమన్యు ఈశ్వరన్ ఎవరు అన్నది తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

 కాగా డెహ్రాడూన్ లో  పుట్టిన అభిమాన్యూ ఈశ్వరన్ 2013లో బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసాడు. ఇక మొదటి రంజీ ట్రోఫీ లోనే అత్యుత్తమ ఘనంగాలను నమోదు చేశాడు. ఇటీవల జరిగిన ఇండియా ఏ మ్యాచ్ లో కూడా అభిమన్యు ఈశ్వరన్ రెండు శతకాలు నమోదు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2015లో మధ్యప్రదేశ్ పై లిస్ట్ ఏ క్రికెట్లోకి వచ్చాడు. 27 ఏళ్ల అభిమన్యు టాపార్డర్ బ్యాట్స్ మెన్ మాత్రమే కాదు లెగ్ బ్రేక్ బౌలర్ కూడా. కాగా ఇప్పుడు వరకు ఈశ్వరన్ 134 ఫస్ట్ క్లాస్ మ్యాచులలో.. 45. 33 సగటుతో 2276 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 233 కావడం గమనార్హం. లిస్ట్ ఏ క్రికెట్ లో బెంగాల్ తరఫున 76 ఇన్నింగ్సుల్లో 3376 పరుగులు సాధించాడు.  అతని ఖాతాలో 18 శతకాలు, 23 అర్ధశతకాలు ఉన్నాయి..

అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 2 వికెట్లు తీశాడు. ఇలా ఇంతటి అత్యుత్తమ గణాంకాలనూ నమోదు చేశాడు కాబట్టే అభిమాన్యూ ఈశ్వరన్ కి టీమిండియాలోకి పిలుపు వచ్చింది అన్నది మాత్రం తెలుస్తూ ఉంది. అయితే ఇక ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ చేస్తుంది. కాగా ఇక టీమిండియాలోకి సెలెక్ట్ అయినప్పటికీ అటు మొదటి మ్యాచ్ ఆడాలి అన్న ఆశ మాత్రం అభిమన్యు ఈశ్వరన్ కు తీరలేదు. మొదటి చోటు దక్కలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: