ఫ్యాన్స్ కి షాక్.. ఆస్పత్రి పాలైన టీమిండియా యువ ఫేసర్?

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియా ఆటగాళ్లను గాయాలు బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఎంతోమంది ఆటగాళ్లు ఆసుపత్రి పాలు అవుతూ ఉండడం అభిమానులు అందరిని కూడా ఆందోళనలో ముంచేస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే మరో యువ ఆటగాడు గాయం బారిన పడ్డాడు. ఆ యువ ఆటగాడు ఎవరో కాదు ఖలీల్ అహ్మద్.  పలు అనారోగ్య కారణాలతో ఖలీల్ అహ్మద్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయింది.

 ఇక ఖలీల్ అహ్మద్  అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలు అయినా నేపథ్యంలో  ఇక రంజీ ట్రోఫీకి దూరం అయ్యాడు అన్నది తెలుస్తుంది. తాను ఆసుపత్రిలో ఉన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అయితే క్రికెట్ కి దూరంగా ఉండటం ఎంతో కష్టంగా ఉంది అంటూ ఖలీల్ అహ్మద్ చెప్పుకొచ్చాడు అని చెప్పాలి. క్రికెట్ కి దూరంగా ఉండడం ఎంతో కష్టంగా ఉంది. అయితే తప్పడం లేదు. నా ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు. అందుకే రంజీ ట్రోఫీ సీజన్లో చాలా మ్యాచులకు దూరంగా ఉండబోతున్నాను

 అయితే త్వరలోనే తిరిగి కోలుకొని మళ్లీ జట్టులోకి వచ్చి క్రికెట్ ఆడి మిమ్మల్ని అలరిస్తాను. నా ఆరోగ్యం బాగుపడాలి అని ప్రార్థించిన వారందరికీ కూడా ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు ఖలీల్ అహ్మద్. అయితే ఖలీల్ అహ్మద్ ఏ ఆరోగ్య సమస్యతో ఆసుపత్రి పాలు అయ్యాడు అన్న విషయం మాత్రం ఇంకా తెలియ రాలేదు. జహీర్ ఖాన్ రిటైర్మెంట్ తర్వాత అతని ప్లేస్ ని భర్తీ చేయగల ఆటగాడు ఖలీల్ అహ్మద్ అని అందరూ భావించారు. కానీ ఎందుకో జట్టులోకి అరంగేట్రం చేసిన తక్కువ సమయంలోనే ఆశించిన ప్రదర్శన చేయలేక టీమిండియా కు దూరమయ్యాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: