అయ్యబాబోయ్.. టెక్నాలజీ ఇలా కూడా వాడొచ్చా?

praveen
ఇటీవల కాలంలో సరికొత్త టెక్నాలజీతో కూడిన వాహనాలు అందరికీ అందుబాటులోకి వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వినియోగించే కార్లలో కూడా ప్రస్తుతం ఆటో డ్రైవ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. తద్వారా ఇక ప్రత్యేకంగా ఒక మనిషి డ్రైవింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటో డ్రైవ్ ఆప్షన్ పెడితే చాలు ఇక కారు దానంతట అదే ముందుకు దూసుకుపోతూ ఉంటుంది. ఇలాంటి ఆప్షన్ అన్ని కార్లలో కూడా అందుబాటులోకి వస్తుంది అని చెప్పాలి. అయితే ఇలా పూర్తిగా ఆటో డ్రైవ్ ఆప్షన్ మీద ఆధారపడటం మంచిది కాదు అని నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు.

 ఇకపోతే టెక్నాలజీని ఎలా వినియోగించుకోవాలి అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ యువకులు చేసిన పని కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మహేంద్ర కంపెనీ నుంచి ఎక్స్ యు వి 700 మోడల్ అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టంతో అందుబాటులోకి వచ్చింది. కారును కొనుగోలు చేసిన కొంతమంది యువకులు స్టీరింగ్ వదిలేసి కదులుతున్న కారులోనే జూదం ఆడటం మొదలుపెట్టారు. ఏకంగా కారులో ఆటో డ్రైవ్ అనే ఆప్షన్ను ఆన్ చేసి ఇక సరదాగా మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. ఇక కారు ఎటు వెళ్తుంది అన్న విషయాన్ని కూడా మరిచిపోయారు అని చెప్పాలి . ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ప్రస్తుతం అందరూ ఇది చూసి షాక్ అవుతున్నారు.

 అదే సమయంలో ఇక ఈ వీడియో పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అని చెప్పాలి. అయితే ఈ వీడియోలో ఎవరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్నట్లు కనిపించడం లేదు. అంతేకాకుండా డ్రైవింగ్ పై ఏకాగ్రత కూడా లేదు. ట్రాఫిక్ నిబంధనలో పాటించకుండా రోడ్డుపై ప్రయాణిస్తున్నారు అన్నది తెలుస్తుంది  ఈ క్రమంలోనే ఇలాంటి వారే రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారని.. వీరిపై చర్యలు తీసుకోవాలని కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది టెక్నాలజీని ఎలా వాడుకోవాలో చూపించారు అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: