ఇషాన్ కిషన్ సునామీ ఇన్నింగ్స్ లో కొట్టుకుపోయిన బంగ్లా పులులు !

VAMSI
ఇండియా మరియు బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న మూడవ వన్ డే కాసేపటి క్రితమే ముగిసింది. వరుసగా రెండు వన్ డే లలో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకున్న బంగ్లా పులులు మూడవ వన్ డే లో మాత్రం అన్ని విభాగాలలో ఫెయిల్ అయ్యి మ్యాచ్ ను ఓడిపోయారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుని ఎంత తప్పిదం చేసింది అనేది మొదటి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం తెలిసి ఉంటుంది. బ్యాటింగ్ కు స్వర్గధామంగా ఉన్న పిచ్ పై టాస్ గెలిచి రివర్స్ డెసీషన్ తీసుకుని మూల్యం చెల్లించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత ఓవర్ లలో వికెట్ల 8 నష్టానికి 409 పరుగులు చేసి బంగ్లా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఇండియా ఇంత స్కోర్ చేసిందంటే అందుకు కారణం ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్ పుణ్యమే అని చెప్పాలి. ఇషాన్ ఒక్కడే ఓపెనర్ గా వచ్చి కెరీర్ లో మొదటి సెంచరీ మరియు డబుల్ సెంచరీ సాధించి ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా మూడేళ్ళ తర్వాత వన్ డే లలో సెంచరీ చేసి పాంటింగ్ రికార్డును అధిగమించాడు. 410 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఏ దశలోనూ లక్ష్యాన్ని చేధించేలా కనిపించలేదు. బంగ్లాదేశ్ కేవలం 34 ఓవర్ లలోనే 182 పరుగులకు ఆల్ అవుట్ అయ్యి సిరీస్ ను 2-1 తో గెలుచుకుంది. బంగ్లా ఇన్నింగ్స్ లో షకీబ్ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇండియా బౌలర్లు కూడా గత రెండు మ్యాచ్ లలో ఎదుర్కొన్న పరాభవానికి ప్రతీకారంగా అందరూ సమిష్టిగా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బంగ్లాను కట్టడి చేశారు. సిరాజ్ 1, శార్దూల్ ఠాకూర్ 3, అక్షర్ పటేల్ 2, ఉమ్రాన్ మాలిక్ 2 , కుల్దీప్ యాదవ్ 1 మరియు వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ లను తమ తమ ఖాతాలలో వేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన ఇషాన్ కిషన్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ను గెలుచుకోగా, సిరీస్ లో బౌలింగ్ మరియు బ్యాటింగ్ రెండు విభాగాలలో రాణించి జట్టు సిరీస్ ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన మెహిదీ హాసన్ మిరాజ్ మ్యాన్ అఫ్ ది సిరీస్ ను గెలుచుకున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: