25 ఏళ్లలో తొలిసారి.. టీమిండియా చెత్త రికార్డు?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో మేటి జట్టుగా కొనసాగుతుంది టీమిండియా. ఈ క్రమంలోనే ఏకంగా టీమిండియాతో మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ప్రత్యర్ధులు సైతం భయపడే విధంగా ప్రస్తానాని కొనసాగించింది. కానీ ఇప్పుడు మాత్రం టీమిండియా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందా అంటే ప్రస్తుతం వస్తున్న ఫలితాలు చూస్తూ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరి నోటి నుంచి అవును అనే సమాధానమే వినిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ద్వైపాక్షిక సిరీస్లలో మాత్రమే కాదు అటు ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీలలో కూడా టీమిండియా పెద్దగా ప్రభావం చూపలేక పోతుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే టీమ్ ఇండియా జట్టు వరుసగా పరాజయం పాలవుతూ ఉండడం పై అటు జట్టు అభిమానులు సహా మాజీ ఆటగాళ్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ముఖ్యంగా టి20 ఫార్మాట్లో పరవాలేదు అనిపిస్తున్న టీమిండియా జట్టు అటు వన్డే ఫార్మాట్లో మాత్రం ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు అని చెప్పాలి. ఇక ఇటీవల బలహీనమైన బంగ్లాదేశ్ జట్టుపై కూడా పటిష్టమైన టీమిండియా గెలవలేకపోయింది. జట్టులో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది.

 ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయిన టీమ్ ఇండియా జట్టు.. సిరీస్ బంగ్లాదేశ్ కు కట్టబెట్టేసింది.  ఇటీవల 25 ఏళ్లలో తొలిసారి చెత్త రికార్డును నమోదు చేసింది టీమిండియా. వన్డే సిరీస్లలో వరుస ఓటములు చవిచూడటం ఆందోళన కలిగిస్తుంది. గత 25 ఏళ్లలో తొలిసారిగా ఒక క్యాలెండర్లో భారత్ 3 ద్వైపాక్షిక వన్డే సిరీస్ లను ఓడింది.సౌత్ ఆఫ్రికా,న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో సిరీస్ కోల్పోయింది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్న ఎంతో మంది మాజీ ఆటగాళ్లు,అభిమానులు ఇలా అయితే వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా మళ్లీ లీగ్ దశ నుంచి నిష్క్రమిస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: