నాకు నా ఫ్యామిలీనే ముఖ్యం.. వార్నర్ షాకింగ్ కామెంట్స్?

praveen
ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు డేవిడ్ వార్నర్. ఏకంగా ఓపెనర్ గా బరిలోకి దిగుతూ ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించగల సత్తా ఉన్న ఆటగాడు ఈ ప్లేయర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తన ఆటతీరుతో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ద్వారా ఇక ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా హీరోగా కూడా మారిపోయాడు. ఐపీఎల్ ద్వారా భారత ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు.

 అలాంటి స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ లైఫ్ లో ఏదైనా చేదు అనుభవం ఉంది అంటే అది సరిగ్గా 2018లో జరిగిన బాల్ టాంపరింగ్ విభాగం అన్న విషయం తెలిసిందే. ఇక ఈ వివాదం కారణంగా రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కొని క్రికెట్కు దూరం అయ్యాడు. అయితే ఆ తర్వాత డేవిడ్ వార్నర్ పై జీవిత కాల కెప్టెన్సీ నిషేధం విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. ఇక ఈ వివాదంలో మరికొంతమంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ కేవలం డేవిడ్ వార్నర్ విషయంలోనే కక్ష కట్టినట్లుగా వ్యవహరించింది క్రికెట్ ఆస్ట్రేలియా. తర్వాత కాలంలో మాత్రం డేవిడ్ వార్నర్ పై ఉన్న జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సవరిస్తుంది అని అందరూ అనుకున్నారు.

 కానీ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ మాత్రం అలాంటి ఆలోచన చేయలేదు. అయితే ఇటీవల ఇక తనపై ఉన్న కెప్టెన్సీ నిషేధం ఎత్తివేసేందుకు అభ్యర్థన చేసుకునేందుకు డేవిడ్ వార్నర్ కు అవకాశం రాగా.. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా కు తన విన్నపాన్ని ఇచ్చాడు. అయితే క్రికెట్ బోర్డు మాత్రం ఇక అతనిపై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయడానికి మొగ్గుచూపులేదు.  దీంతో తీవ్ర ఆసం తృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల కెరియర్ నాశనం చేయడమే బోర్డు లక్ష్యం అంటూ ఆరోపించాడు.  నాకు నా ఫ్యామిలీ ఎంతో ముఖ్యం. వారికి ఈ బురద అస్సలు అంటనివ్వను అంటూ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు. నిషేధంతొలగించాలన్న దరఖాస్తును వెనక్కి తీసుకుంటున్న అంటూ చెప్పుకుచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: