బార్బర్ కుటుంబంలో పుట్టి.. ఇప్పుడు భారత జట్టులోకి?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్లో యువ ఆటగాళ్ల ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అని చెప్పాలీ  ఐపీఎల్ అనే ఒక మంచి టోర్ని ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్లకు లైఫ్ ఇస్తుంది బీసీసీఐ. కేవలం స్వదేశీ ఆటగాళ్లకు మాత్రమే కాదు విదేశీ ఆటగాళ్లకు సైతం అంతర్జాతీయ జట్టులో చోటు సంపాదించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది అని చెప్పాలి. ఇలా ఐపిఎల్ ద్వారా ఇప్పటి వరకు ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చారు.

 ఇక ఇటీవల ఇలాంటి ఒక మట్టిలో మాణిక్యమే టీమిండియాలోకి కూడా అరంగేట్రం చేశాడు అని చెప్పాలి. ప్రస్తుతం భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉండగా ఈ పర్యటనలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో యువ ఫేసర్ కుల్దీప్ సేన్ చోటు సంపాదించుకున్నాడు. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ ఆటగాడు తొలి వన్డే మ్యాచ్లో ఆడాడు అని చెప్పాలి. అయితే కొత్తగా అరంగేట్రం చేసిన ఈ యువ ఆటగాడు ఎవరు అన్న విషయం తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. ఇక ఇతని గురించి అసలు విషయాలు తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

 పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని కుల్దీప్ సేన్ నిరూపించాడు అంటూ ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఎందుకంటే కుల్దీప్ సేన్  ఒక బార్బర్ కుటుంబంలో పుట్టి ఇప్పుడు అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగాడు. మధ్యప్రదేశ్లోని రెవా జిల్లాలోని చిన్న గ్రామం హరిహర పూర్ లో జన్మించాడు ఈ యువ ప్లేయర్. అతని తండ్రి రాంపాల్ ఒక సెలూన్ నిర్వహిస్తూ ఉంటారు. ఇక అతనికి ఐదుగురు సంతానం మూడోవాడు కుల్దీప్ సేన్. రెక్కాడితే కానీ  డొక్కాడని కుటుంబం వీరిది. ఇలాంటి సమయంలోనే అతనికి కోచ్ అంథోని అండగా నిలిచి ఇక అన్ని అతనే చేసుకున్నాడు. చివరికి అతని అండతో  ఇప్పుడు ఏకంగా భారత జట్టులోకి అరంగేట్రం చేసాడు కుల్ దీప్ సేన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: