సీనియర్ క్రికెటర్లపై "యంగ్ ప్లేయర్స్" ఎఫెక్ట్... ఆడకుంటే చోటు కష్టమే !

VAMSI
న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఇండియాకు కొన్ని చేదు అనుభవాలు మిగిలాయి అని చెప్పాలి. ఈ పర్యటనలో మొత్తం మూడు టీ 20 లు మరియు మూడు వన్ డే లు జరుగగా, వాటిలో కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే పూర్తి అతను జరుపుకున్నాయి. అలా ఇండియా ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి టీ 20 సిరీస్ ను గెలుచుకోగా, న్యూజిలాండ్ మొదటి వన్ డే ను గెలుచుకుని సిరీస్ ను చేజిక్కించుకుంది. అయితే ఇండియాకు మాత్రం ఈ పర్యటనలో కొందరి ప్లేయర్ ల ప్రదర్శన సంతృప్తిని ఇవ్వలేదు. వారిలో పంత్, అందరు బౌలర్లు మరియు సూర్యకుమార్ యాదవ్ లు విమర్శలను ఎదుర్కొన్న వారిలో ఉందన్నారు . ముఖ్యంగా పంత్ కు అయితే ఇది గడ్డు కాలం  అని చెప్పాలి.
కాగా రేపటి నుండి బంగ్లాదేశ్ పర్యటనలో మూడు వన్ డే లు మరియు రెండు టెస్ట్ లను ఆడనుంది. ఈ సిరీస్ కు న్యూజిలాండ్ పర్యటనకు దూరమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కె ఎల్ రాహుల్, అక్సర్ పటేల్ లు బరిలోకి దిగనున్నారు. వరల్డ్ కప్ లో అదర గొట్టిన విరాట్ కోహ్లీ పై అందరి చూపు నెలకొంది. ఇక కెప్టెన్ గా మరియు ప్లేయర్ గా ఫెయిల్ అయిన రోహిత్ శర్మ పైన కూడా భారం ఉందని చెప్పాలి. ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు పదునైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారు. వారి ఆట ప్రభావం సీనియర్స్ మీద పడుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
మరి రేపు జరగనున్న మొదటి వన్ డే లో బంగ్లాదేశ్ తో అయినా ఫామ్ కోల్పోయిన ఇండియా ఆటగాళ్లు తిరిగి ఫామ్ లోకి వస్తారా ? అన్న విషయం పైన సోషల్ మీడియా వేదికగా చర్చలు జోరుగా జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: