శ్రేయస్ బ్యాటింగ్ లో అదొక్కటే లోపం : సైమన్ డౌల్

praveen
ఇటీవల జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా 80 పరుగులు చేసి టీమ్ ఇండియాను విజయ తీరాల వైపుకు నడిపించాడు. కానీ ఆ తర్వాత బౌలర్లు సరైన ప్రదర్శన చేయకపోవడంతో చివరికి మొదటి వన్ డే మ్యాచ్ లో టీమ్ ఇండియా ఓటమిపాలు అయ్యింది అని చెప్పాలి. అయితే శ్రేయస్ అయ్యర్ 80 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఇక అతను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో మాత్రం కాస్త ఇబ్బంది పడ్డాడు.

 ఈ క్రమం లోనే ఇటీవల ఇదే విషయం పై న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ డౌల్ స్పందిస్తూ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో శ్రేయస్ అయ్యర్  కాస్త ఇబ్బంది పడుతున్నాడు అంటూ సైమన్ డౌల్ చెప్పుకొచ్చాడు. కానీ మిగతా అన్ని రకాల బంతులను కూడా అతను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ లో ఉన్న ఆ ఒక్క లోపాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది అంటూ సైమన్ డౌల్ తెలిపాడు.

 ముఖ్యం గా స్పిన్ బౌలింగ్ లో అయితే శ్రేయస్  మరింత దూకుడుగా ఆడుతున్నాడు అంటూ చెప్పు కొచ్చాడు. కానీ అతను పరిస్థితులకు తగ్గట్లుగా కాస్త దూకుడు తగ్గించి ఆడితే బాగుంటుంది.. అతను అలా ఆడితేనే చూడాలనిపిస్తుంది అంటూ సైమన్ డౌల్ చెప్పుకొచ్చాడు.  అదే సమయం లో ఇక ఇటీవల మొదటి వన్డే మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ఉమ్రాన్ మాలిక్ గురించి కూడా మాట్లాడాడు. కఠినమైన పిచ్ పై ఇది నిజంగా మంచి అరంగేట్రం. ఇక రానున్న రోజుల్లో అతను చాలా కాలం పాటు దేశం తరఫున ఆడతాడని అనుకుంటున్న అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: