రెండవ వన్ డే: ఇండియా న్యూజిలాండ్ జైత్రయాత్రకు బ్రేక్ వేస్తుందా ?

VAMSI
ఇండియా రేపు హామిల్టన్ వేదికగా రెండవ వన్ డే ఆడనుంది. మొదటి వన్ డే లో అనూహ్య పరాజయం తర్వాత కొన్ని విమర్శలు ఎదుర్కొన్న టీం ఇండియా కీలకమైన వన్ డే లో బరిలోకి దిగనుంది. బ్యాటింగ్ లో అదరగొట్టిన ఇండియా బౌలింగ్ లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. అయిదుగురు ఇండియా బౌలర్లు కలిపి కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. గత మ్యాచ్ లో రికార్డ్ భాగస్వామ్యాన్ని (221) టామ్ లాతమ్ మరియు విలియమ్సన్ లు నెలకొల్పారు. ఈ మ్యాచ్ లో ఇండియా తరపున ధావన్ , గిల్ , శ్రేయాస్ అయ్యర్ మరియు వాషింగ్టన్ సుందర్ లు రాణించి టీం ఇండియాకు మెరుగైన స్కోర్ ను అందించారు.
ఇక ఆఖరుకు కివీస్ మరో 17 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది. ఈ విజయంతో సొంతగడ్డపై కివీస్ వరుసగా 13 మ్యాచ్ లలో గెలుపొంది అన్ని జట్లకు షాక్ ఇస్తోంది. గత ఫిబ్రవరి 2019 నుండి మొన్న ముగిసిన వన్ డే వరకు వన్ డే లలో ఓటమిని ఎరుగకుండా తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. అయితే టీం ఇండియా రేపు మ్యాచ్ లో కివీస్ ను ఓడించి వారి విజయాల పరంపరకు బ్రేక్ వేయాలని చూస్తోంది. ఇందుకోసం టీం ఇండియా జట్టులో కనీసం రెండు మార్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది.
గత కొంతకాలంగా బౌలింగ్ లో అంతగా రాణించని లెగ్ స్పిన్నర్ యఙవేంద్ర చాహల్ ను తప్పించే ఆలోచనలో టీం యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. చాహల్ స్థానంలో మరో స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ను తుదిజట్టులోకి తీసుకుంటారని టాక్. ఇక మరో బౌలర్ పై కూడా వేటు వేసే అవకాశాలు ఉన్నాయి. టీ 20 లలో విశేషంగా రాణించిన అర్షదీప్ సింగ్ ను పక్కన పెట్టి దీపక్ చాహర్ కు ఛాన్స్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు భోగట్టా.  మరి ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచి కివీస్ జోరుకు బ్రేక్ వేస్తుందా లేదా ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంటుందా చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: