రోనాల్డో అరుదైన రికార్డ్.. క్రేజ్ మామూలుగా లేదుగా?

praveen
ప్రపంచవ్యాప్తంగా ప్రతి చిన్న దేశంలో కూడా పాపులారిటీ సంపాదించుకున్న గేమ్ ఏదైనా ఉంది అంటే అది ఫుట్ బాల్ అనే చెప్పాలి. ఫుట్ బాల్ మ్యాచ్ లు వస్తున్నాయి అంటే చాలు ఇక ప్రపంచ క్రీడాభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా మ్యాచ్లను వీక్షించడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఉత్కంఠ భరితంగా   జరిగే మ్యాచ్లను చూసి తెగ ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఫుట్ బాల్ ఆటకి ఇంత క్రేజ్ ఉన్నప్పుడు ఇక అదే ఆటలో భాగమైన ఆటగాళ్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇలా ఫుట్బాల్ ఆటలో స్టార్ ప్లేయర్లుగా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న వారిలో క్రిస్టియానో రోనాల్డో మొదటి స్థానంలో ఉంటాడు అని చెప్పాలి. ఏకంగా సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల ద్వారానే క్రిస్టియానో రోనాల్డో వందల కోట్ల వెనకేసుకుంటున్నాడు అంటే అతని క్రేస్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా పోర్చుగల్ జట్టు తరఫున కొనసాగుతున్నాడు క్రిస్టియానో రోనాల్డో. ఇక అతని ప్రదర్శనను చూసేందుకు అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 కాగా పోర్చుగల్ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియనో రోనాల్డ్ ఇటీవల సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయిన ఇంస్టాగ్రామ్ లో ఒక అరుదైన ఘనత సాధించాడు అని చెప్పాలి. 500 మిలియన్ ఫాలోవర్లు కలిగిన తొలి వ్యక్తిగా అవతరించాడు రోనాల్డో. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అతనికి 400 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. కేవలం 9 నెలల కాలంలోనే 100 మిలియన్ల ఫాలోవర్లు సంపాదించాడు ఈ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్. దీనిబట్టి అతని క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది. ఇక రోనాల్డో తర్వాత లియోనాల్ మేస్సి 376 మిలియన్ల ఫాలోవర్లతో  రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక 2003 మిలియన్ల ఫాలోవర్లతో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏడవ స్థానంలో ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: