టీమిండియాతో మ్యాచ్ అంటే.. 300 పరుగులు చేయాల్సిందే?

praveen
ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా అక్కడ టి20 సిరీస్ ఆడుతుంది. ఇక ఈ సిరీస్ ముగిసిన వెంటనే శిఖర్ ధావన్ కెప్టెన్సీ లో వన్డే సిరీస్ కూడా ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అన్న విషయంపై ఎంతోమంది తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇకపోతే ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో భారత జట్టు ఎంత అద్భుతంగా రానించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూజిలాండ్ జట్టును సొంత గడ్డపైనే 65 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయాన్ని అందుకుంది.

 ఈ క్రమంలోనే భారత జట్టు ప్రదర్శన పై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు. అయితే న్యూజిలాండ్ పర్యటన ముగిసిన వెంటనే భారత జట్టు అటు బంగ్లాదేశ్ లో పర్యటించేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఇలా మరికొన్ని రోజుల్లో బంగ్లాదేశ్ జట్టుతో భారత్ వరసగా సిరీస్లలో తలబడ పోతున్న నేపథ్యంలో ఆ జట్టు ఆల్రౌండర్ మెహదీ హసన్ ఆ జట్టు ఆటగాళ్లను హెచ్చరించాడు   బ్యాటర్లు గేమ్ పై ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ రోజుల్లో 250- 260 స్కోర్ ఏమాత్రం సురక్షితం కాదు అంటూ అభిప్రాయపడ్డాడు.

 వన్డే క్రికెట్ లో తొలిత బ్యాటింగ్ చేసే జట్టు కనీసం 280 నుంచి 300 పరుగులు చేయాలి. అప్పుడే బౌలర్లు గెలుపు కోసం పోరాడేందుకు అవకాశం ఉంటుంది. దేవుడి దయవల్ల ఇటీవల కాలంలో మనం ఈ ఫార్మాట్లో 300 రన్స్ కూడా చేయగలుగుతున్నాం. అయితే టాప్ ఆర్డర్ లోని అయిదుగురు బ్యాట్స్మెన్లు త్వరగా వికెట్లు ఇవ్వకపోతే సులువుగా 300 మార్కులు దాటేయొచ్చు. ఇక భారత్ లాంటి జట్టుతో పోరాడాలి అంటే తప్పకుండా 300 పరుగులు చేయాల్సిందే. ఇండియాతో జరిగే మ్యాచ్లలో ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉండాల్సి ఉంటుంది అంటూ మెహదీ హసన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: