టి20 ప్రపంచ కప్.. ఫిఫా వరల్డ్ కప్.. ప్రైజ్ మనీలో ఎంత తేడా ఉందో?

praveen
ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టి20 వరల్డ్ కప్ క్రికెట్ ప్రేక్షకులందరికీ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవలే టి20 వరల్డ్ కప్ ముగిసిందో లేదో ఇక క్రీడ అభిమానులు అందరికీ కూడా అలరించేందుకు ప్రస్తుతం ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ సిద్దమయింది అన్న విషయం తెలిసిందే. ఖతార్ వేదికగా జరుగుతున్న ఈ ఫిఫా వరల్డ్ కప్ ను చూసేందుకు ప్రస్తుతం క్రీడ అభిమానులు అందరూ కూడా సిద్ధమైపోతున్నారు.

 కాగా నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ ఫిఫా 2022 ఫుట్ బాల్ వరల్డ్ కప్ కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రత్యక్షం అవుతున్నాయి అని చెప్పాలి. అయితే ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో ఎలాంటి వరల్డ్ కప్ జరిగినా కూడా అందులో టైటిల్ గెలిచే జట్లకు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారు అన్నది ఎప్పుడు హాట్ టాపిక్ గానే మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న టి20 వరల్డ్ కప్ జరిగినన్ని రోజులు ఇక ఇందుకు సంబంధించిన చర్చ జరిగింది. ఇక ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో టైటిల్ విన్నర్ కు ప్రైజ్ మనీ ఎంత అన్నది హాట్ టాపిక్ గా మారింది.

 అదే సమయంలో ఇక టి20 వరల్డ్ విజేత ప్రైజ్ మనీతో పోల్చి చూస్తే ఫిఫా వరల్డ్ కప్ ప్రైజ్ మనీ భారీ రేంజ్ లో ఉందన్న విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఇతర క్రీడలతో పోల్చి చూస్తే మొత్తంగా ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్ మనీ ఎక్కువగానే ఉంది. మొత్తం ప్రైజ్ మనీ 440 మిలియన్ డాలర్లు కాగా.. విజేతకు 42 మిలియన్ డాలర్లు రన్నరఫ్ గా నిలిచిన జట్టుకు 30 మిలియన్ ఇవ్వనున్నారు. ఈ మెగా టోర్నమెంట్లో పాల్గొనే 32 దేశాలకు మిగతా మొత్తాన్ని ప్రైజ్ మనీ గా ఇస్తారు. ఇదిలా ఉంటే టి20 వరల్డ్ కప్ లో మాత్రం మొత్తం ప్రైజ్ మనీ 10 మిలియన్ డాలర్లే కావడం గమనార్హం. విజేతకు నాలుగు మిలియన్ డాలర్లు, రన్నరప్ కు రెండు మిలియన్ డాలర్లు ఇక మిగతాది అన్ని టీములకు ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: