క్రికెట్లో సౌత్ ఆఫ్రికా.. ఫుట్ బాల్ లో నెదర్లాండ్స్.. పాపం అంటున్న ఫ్యాన్స్?

praveen
సాధారణంగా.. ఏ ఆటలో అయినా సరే హార్డ్ వర్క్ ఎంత ముఖ్యమో అదృష్టం కూడా అంతే ముఖ్యం అని ఎంతోమంది క్రీడ నిపుణులు చెబుతూ ఉంటారు. అయితేకొన్ని దిగ్గజ జట్లను అటు దురదృష్టం వెంటాడటం చూస్తూ ఉంటే.. ఇది నిజమేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇక అచ్చంగా క్రికెట్లో సౌత్ ఆఫ్రికా విషయంలో ఇలాగే జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికా జట్టు అనగానే ప్రత్యర్థి వెన్నులో  వణుకు పుడుతూ ఉంటుంది. అరివీర భయంకరమైన ప్లేయర్లు ఆ జట్టులో ఉంటారు.

 ఇక ఎలాంటి పటిష్టమైన జట్టు మీద అయినా సరే విధ్వంసం సృష్టించగల సామర్థ్యం సౌతాఫ్రికా సొంతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ క్రికెట్లో ఎన్ని జట్లు ఉన్న అటు సౌత్ ఆఫ్రికా మాత్రం అన్నింటికంటే పటిష్టమైన జట్టు అని క్రికెట్ విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉంటారు. కానీ ద్వైపాక్షిక సిరీస్లలో అద్భుతంగా రాణించే సౌత్ ఆఫ్రికా జట్టు అటు వరల్డ్ కప్ లో మాత్రం ఒత్తిడికి లోనై ఇంటి బాటపడుతూ చివరికి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది.

 అయితే సౌత్ ఆఫ్రికా ఎలా అయితే వరల్డ్ కప్ లో ఒత్తిడి కి లోనై ఇంటి బాట పడుతుందో అచ్చంగా ఇలాగే ఫుట్బాల్ లోను దురదృష్టకరమైన జట్టుగా నెదర్లాండ్స్ టీం కి పేరు ఉంది అని చెప్పాలి. ఫిఫా ర్యాంకింగ్స్ లో 8వ స్థానంలో కొనసాగుతున్న నెదర్లాండ్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ లో భాగంగా మూడుసార్లు రన్నరపుగా నిలిచింది. కానీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఇక ఆ జట్టుకు టైటిల్ అందని ద్రాక్ష లానే మారిపోయింది. గత కొన్ని రోజుల నుంచి వరుసగా 15 మ్యాచ్ లలో గెలిచిన ఈ టీం ఇక ఈ వరల్డ్ కప్ లో అయినా టైటిల్ గెలుస్తుంది లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: