జట్టు నుంచి ఆ ఆరుగురుని తప్పించండి.. ఫ్యాన్స్ డిమాండ్?

praveen
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఘోర వైఫల్యం చివరికి అభిమానులందరికీ చిరాకు తెప్పించింది అన్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో వరుస విజయాలు సాధించిన టీమ్ ఇండియా అటు కీలకమైన సెమీఫైనల్ పోరులో మాత్రం చేతులెత్తేసింది. దీంతో ఇంగ్లాండ్ చేతిలో ఘోర ఓటమి చవిచూసింది. కనీస పోటీ ఇవ్వలేక పది వికెట్ల తేడాతో పరాజయం  పాలయ్యింది అని చెప్పాలి. ఇక భారత జట్టు ఓటమిపై అటు టీమిండియ అభిమానులు మాత్రమే కాదు మాజీ ఆటగాళ్లు కూడా తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 ఈ క్రమంలోనే జట్టు ప్రక్షాళనకు సమయం ఆసన్నమైంది అంటూ ఎంతోమంది అభిమానులు అభిప్రాయపడుతూ ఉండడం గమనార్హం.. ఈ క్రమంలోనే కొంతమంది ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించి సాహసోపేతమైన నిర్ణయాలకు అటు బిసిసిఐ నాంది పలకల్సిందేనని లేదంటే ఫ్యూచర్లో మరిన్ని అవమానకరమైన ఓటములు తప్పవు అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మల పై పెటు వేసి దేవదత్ పడిక్కాల్- ఋతురాజు గైక్వాడ్ లేదా ఇషాన్ కిషన్ - సంజు శాంసన్  లో ఏదో ఒక జోడిని ప్రయత్నించాలని.. ఈ నిర్ణయం వల్ల జట్టు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ సమస్య కూడా తీరుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

 మిడిల్ ఆర్డర్లో దాటిగా ఆడే సామర్థ్యం కలిగి ఉన్న శ్రేయస్ అయ్యర్,  సంజూ శాంసన్ లనుజట్టులోకి తీసుకొని ఆకట్టుకోలేకపోతున్న పంత్ ను పక్కన పెట్టాలి అంటూ అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో బ్యాట్స్మెన్ గా కాదు కనీసం బౌలర్ గా కూడా న్యాయం చేయలేకపోతున్న అక్షర పటేల్ స్థానంలో రవీంద్ర జడేజా లేదా దీపక్ హుడా ను తీసుకోవాలని.. మోస్ట్ సీనియర్ అశ్విన్ స్థానంలో చాహల్ లేదా కుల్దీప్ యాదవ్ లను.. ఫాస్ట్ బౌలింగ్ తో ఆకట్టుకోలేకపోతున్న భువనేశ్వర్ కుమార్ ను పక్కనపెట్టి బుమ్రా ను తీసుకోవాలని కోరుతున్నారు అభిమానులు. ఇలా ఆరుగురిని పక్కనపెట్టి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగిస్తే ఇక టీమిండియా దశ మారుతుందని సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: