కోచ్ గా ద్రావిడ్ పనికిరాడు.. పాక్ మాజీ సంచలన వ్యాఖ్యలు?

praveen
ఎప్పుడు చాన్స్ దొరుకుతుందా ఎప్పుడు టీమిండియ ఆటగాళ్ళపై విమర్శలు చేద్దామా లేదంటే బిసిసిఐపై అక్కస్సు ను వెలగక్కలా అని వేచి చూస్తూ ఉంటారు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు. ఈ క్రమంలోనే ఏదైనా ఛాన్స్ వచ్చింది అంటే చాలు మనసులో దాచుకున్న కుళ్ళు మొత్తం బయటపెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా ఇక ఫైనల్ కు చేరకుండానే సెమీఫైనల్ లో ఓటమితో ఇంటిదారి పట్టింది.

 అదే సమయంలో పాకిస్తాన్ జట్టు మాత్రం ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఫైనల్లో అడుగు పెట్టింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక సొంత డబ్బా కొట్టుకోవడమె కాదు టీమిండియా పై సెటైర్లు వేస్తూ పాక్ మాజీ ఆటగాళ్లు ఆనందం పొందుతూ ఉన్నారు. ఇక ఇటీవల  ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానీష్ కనేరియా కూడా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అని చెప్పాలి. ఆటగాళ్ల ప్రదర్శన పై ఏమి మాట్లాడలేదు కానీ ఏకంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పై మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 టి20 ఫార్మాట్ కు రాహుల్ ద్రవిడ్ కోచ్గా సెట్ కాడని.. అతడిని కేవలం టెస్ట్ ఫార్మాట్ కి మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుందని మంచి ఫలితాలు రాబట్టవచ్చు అంటూ  కనేరియా వ్యాఖ్యానించడం సంచాలనంగా మారింది. టీమిండియాను టి20 ప్రపంచ కప్ ఛాంపియన్గా తీర్చిదిద్ద గల మైండ్ సెట్ ద్రవిడ్ కు లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ద్రవిడ్ లో దూకుడు లేదని టి20 ఫార్మాట్లో ఉండే ఒత్తిడిని ఎలా జయించాలో కూడా ద్రవీడ్ కు తెలియదు అంటూ వ్యాఖ్యానించాడు డానిష్ కనేరియా. ఇక అతను చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: