ఇంటికి వెళ్లాల్సిన పాకిస్తాన్ ఫైనల్ కు.. అంతా అతని చలవేనా?

praveen
క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఎవరి ఊహకందని విధంగా ఉంటుంది అన్నది ఇక ఇటీవల ఈ ఏడాది జరిగిన ప్రపంచ కప్ లో నిజం అయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మరోసారి వరల్డ్ కప్ గెలుస్తుంది అనుకున్న ఆస్ట్రేలియా సొంత పిచ్ ల పైన కూడా తేలిపోయింది. ఛాంపియన్ జట్లు సైతం పసికూన  చేతిలో ఓడిపోయాయి. అదే సమయంలో ఇంటికి వెళ్తుంది అనుకున్న పాకిస్తాన్ ఫైనల్ కు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పాకిస్తాన్ కు ఎక్కడో సుడి ఉంది అని ఇప్పుడు ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

 వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో  పాకిస్తాన్ ఇంటికి వెళ్లడం ఖాయం అనుకున్నారు అందరూ. కానీ ఆ తర్వాత వరుస విజయాలు సాధించి సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది పాక్. అయినప్పటికీ పాకిస్తాన్ ఇంటికే అని భావించారు. కానీ నెదర్లాండ్స్ చేతిలో అరివీర భయంకర సౌత్ ఆఫ్రికా ఓడిపోవడం ఏంటి పాకిస్తాన్ సెమి ఫైనల్ లో అడుగుపెట్టడం ఏంటి.. సెమీఫైనల్ లో అడుగుపెట్టిన అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న న్యూజిలాండ్ ను ఓడించడం కష్టమే అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో న్యూజిలాండ్ ను మట్టి కరిపించి ఫైనల్ లో అడుగు పెట్టింది పాకిస్తాన్.

 అయితే పాకిస్తాన్ ఇంటికి వెళుతుంది అనుకున్న సమయంలో జట్టు ఆటగాళ్ళలో ఆత్మ విశ్వాసాన్ని నింపి జట్టును ముందుకు నడిపించింది మాత్రం ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ  హెడెన్ అన్నది క్రీడా పందితులు చెబుతున్న మాట. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుకు మెంటర్గా వ్యవహరిస్తున్నాడు మాథ్యూ  హెడెన్. పాకిస్తాన్ దశ మార్చే పనిలో ఉన్న హెడెన్ దాదాపు సక్సెస్ అయిపోయాడు అని చెప్పాలి. ఒకవేళ పాకిస్తాన్ ఇంగ్లాండ్ ను ఓడించి విశ్వవిజేతగా నిలిచిందంటే క్రెడిట్ మొత్తం మాథ్యూ  హెడెన్ కు వెళ్తుందేమో. ఇటీవల సెమీఫైనల్ లో న్యూజిలాండ్ ను ఓడించిన వెంటనే పాక్ కెప్టెన్ బాబర్ పరిగెత్తుకుంటూ వెళ్లి మాథ్యూ  హెడెన్ ను ఆనందంతో కౌగిలించుకున్నాడు. దీన్నిబట్టి అతను జట్టులో ఎంత స్ఫూర్తిని చెప్పాడు. ఎలా ధైర్యాన్ని నింపి ముందుకు నడిపించాడు అర్థం చేసుకోవచ్చు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: