నెదర్లాండ్స్ పై ఓటమి.. సౌత్ ఆఫ్రికా ఆ పేరు నిలబెట్టుకుంది : అక్తర్

praveen
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగాఎవరు ఊహించని ఫలితం ఇక ఇటీవల జరిగిన ఒక మ్యాచ్ లో వెలువడింది. ఏకంగా ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే భయంకరమైన సౌత్ ఆఫ్రికా జట్టు పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవడం అందరిని అవాక్కేలా చేసింది. చివరి మ్యాచ్ లో అలవోకగా విజయం సాధించి సెమీఫైనల్కు వెళుతుంది అనుకున్న సౌతాఫ్రికా చివరికి నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయి ఇక ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.

 అయితే సౌత్ ఆఫ్రికా ఓడిపోవడం తో అటు వరల్డ్ కప్ లో ఉన్న సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. సెమీఫైనల్కు చేరేందుకు ఏమాత్రం అవకాశాలు లేని పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్లకు ఏకంగా సెమీఫైనల్ లో ఛాన్స్ దక్కించుకునే అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే ఇక సూపర్ 12 మ్యాచ్ లో సెమీఫైనల్ అవకాశం కోసం హోరాహోరీగా జరిగిన పోరులో పాకిస్తాన్ విజయం సాధించి చివరికి భారతతో పాటు సెమీఫైనల్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి. కాగా పసికూన నెదర్లాండ్స్ చేతిలో దిగ్గజా సౌత్ ఆఫ్రికా ఓడిపోవడంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

 పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ సైతం స్పందిస్తూ సౌత్ ఆఫ్రికా పై సెటైర్లు వేశాడు. కీలక సమయం లో ఒత్తిడికి గురై నిరాశ పరుస్తారనే పేరును దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మరో సారి నిలబెట్టుకున్నారు అంటూ సెటైర్లు వేశాడు షోయబ్ అక్తర్. ఇక నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడి తమకు సెమీ ఫైనల్ అవకాశాలు కల్పించినందుకు సౌత్ ఆఫ్రికాకు థాంక్స్ చెప్పాడు. ఈ అవకాశాన్ని పాకిస్తాన్ జట్టు సద్వి నియోగం చేసుకోవాలని కప్పు కొట్టి రావాలి అంటూ సూచించాడు. మరో సారి ఫైనల్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చూడాలని ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: