సెమీస్ లో.. టీమిండియాకు పొంచి ఉన్న గండం ఇదే?

praveen
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం సూపర్ 12 పోరు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే గ్రూప్ 1 నుంచి అటు న్యూజిలాండ్ ఇంగ్లాండ్ జట్టు సెమి ఫైనల్ లో అడుగుపెట్టాయి అన్న విషయం తెలిసిందే. గ్రూప్-2 లో భాగంగా ఎక్కువ పాయింట్లు సాధించిన న్యూజిలాండ్ జట్టు టాప్ ప్లేస్ లో నిలిచి సెమీఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న మొదటి జట్టుగా నిలిచింది. ఇక మరోవైపు ఇంగ్లాండ్ జట్టు ఇటీవలే శ్రీలంక ను ఓడించడం ద్వారా ఆస్ట్రేలియాను రన్ రేట్ పరంగా వెనక్కి నెట్టి సెమి ఫైనల్ బెర్త్  కన్ ఫార్ము చేసుకుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే గ్రూప్ 2 నుంచి ఎవరు సెమీఫైనల్ లో అడుగు పెట్టబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా జట్టు నెదర్లాండ్స్ తో జరగబోయే మ్యాచ్లో గెలిస్తే ఇక నేరుగా సెమీఫైనల్కు అర్హత సాధిస్తుంది. అయితే అటు భారత జట్టు జింబాబ్వే తో జరగబోయే మ్యాచ్ లో గెలిచిన లేదా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిన కూడా ఇక ఆ తర్వాత పాకిస్తాన్ కు సెమీస్ వెళ్లే అవకాశాలు దాదాపు మూసుకుపోతాయి. బంగ్లాదేశ్ పై గెలిచిన ఉపయోగం ఉండదు అని చెప్పాలి.

 అయితే భారత జట్టు సెమీఫైనల్ వెళ్ళినప్పటికీ మరో ముప్పు పొంచి ఉంది అన్నది తెలుస్తుంది. ఈ ఏడాది వరల్డ్ కప్ లో భాగంగా అంచనాలు లేకుండా బలిలోకి దిగి ఏకంగా అద్భుతమైన ప్రదర్శనతో గ్రూప్2లో టాప్ ప్లేస్ లో నిలిచిన న్యూజిలాండ్తో అటు భారత్ సెమిస్లో తలబడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న న్యూజిలాండ్ ను టీమిండియా ఎంత మేరకు ఎదుర్కోగలుగుతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. ఇలా సెమీఫైనల్ లో టీం ఇండియాకు అసలు సిసలైన సవాల్ ఎదురు కాబోతోంది అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: