కేఎల్ రాహుల్ వైఫల్యంపై.. కోచ్ ద్రవిడ్ ఏమన్నాడో తెలుసా?

praveen
ఈ ఏడాది టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లలో అటు టీం ఇండియా కూడా ఒకటి అన్న విషయం తెలిసందే. కీలక ఆటగాళ్లు దూరమైనప్పటికీ ఇక ఎంతోపటిష్టంగా ప్రత్యర్ధులకు అసలు సిసలైన సవాల్ విసిరుతుంది అని చెప్పాలి  ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది  ఇందులో భాగంగానే పాకిస్తాన్ నెదర్లాండ్స్ జట్లపై విజయకేతనం  ఎగరవేసిన టీమ్ ఇండియా ఇప్పటికే నాలుగు పాయింట్లు సాధించింది అన్న విషయం తెలిసింది. అంతేకాకుండా మెరుగైన రన్ రేట్ కూడా కొనసాగిస్తూ ఉంది.

 ఇలాంటి సమయంలోనే అటు దక్షిణాఫ్రికా చేతిలో ఊహించని రీతిలో ఓటమిపాలు అయింది. తద్వారా ఇక తర్వాత ఆడబోయే రెండు మ్యాచ్ లలో కూడా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. అయితే అయితే వరల్డ్ కప్ ప్రారంభమైన నాటి నుంచి కూడా టీం ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ గురించిన చర్చ తీవ్రంగా జరుగుతుంది అని చెప్పాలి.  ఎందుకంటే ఈ వరల్డ్ కప్ లో భాగంగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మొత్తంగా మూడు మ్యాచ్లలో కలిపి కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు కేఎల్ రాహుల్. దీంతో అతను జట్టుకు భారంగా మారుతున్నాడని వెంటనే అతని పక్కన పెట్టాలి అంటూ డిమాండ్లు కూడా ఎక్కువ అవుతున్నాయి.

 ఇక ఇటీవల ఇదే విషయంపై టీం ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందరూ కేఎల్ రాహుల్ ని జట్టు నుంచి తప్పించాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉంటే.. రాహుల్ ద్రావిడ్ మాత్రం అతనికి మద్దతుగా నిలిచాడు. కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడు. అతను స్ట్రాంగ్ గా తిరిగి వస్తాడని నమ్మకం మాకు ఉంది. ఆస్ట్రేలియా కండిషన్ లో ఎలాంటి ఓపెనర్లకు అయినా సవాల్ లాంటిదే. కేఎల్ రాహుల్ మాకు ఎంతో ముఖ్యం  ఆటపై అతను ఎంత ప్రభావం చూపుతాడో అందరికీ తెలుసు అంటూ రాహుల్ ద్రవిడ్ కేఎల్ రాహుల్  ని వెనకేసుకొచ్చాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: