ఆ గ్రామంలో దీపావళి ఉండదు.. ఎందుకో తెలుసా?

praveen
హిందూ సాంప్రదాయం ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ జరుపుకునే పండుగలలో అటు దీపావళి కూడా ఒక పెద్ద పండుగ అని చెప్పాలి. మంచిపై చెడు సాధించిన విజయానికి ప్రతీకగా  దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సామాన్యుల దగ్గర నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక ఈ పండుగను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. బంధు మిత్రులందరికీ మధ్యలో దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 ఈ క్రమం లోనే దీపావళి పండుగను పురస్కరించుకుని ఎక్కడ చూసినా కూడా దీపాల కాంతుల  తో భారత్ మొత్తం వెలిగిపోతూ ఉంటుంది. ఇక ఎంతో మంది తమకు ఇష్టమైన టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక గ్రామాలలో అయితే దీపావళి పండుగ సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి. కానీ ఇప్పటివరకు అసలు దీపావళి పండుగను జరుపుకొని ఒక గ్రామం ఉంది అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అదేంటి దేశం మొత్తం దీపావళి పండుగ సంబరాల్లో మునిగిపోతే ఆ గ్రామం ఎందుకు దీపావళి జరుపుకోదు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది.

 ఇలా దీపావళి జరుపుకోక పోవడానికి ఒక పెద్ద కారణమే ఉందట. ఇలా దీపావళి పండుగ వేళ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఉన్ననపాలెం గ్రామం మాత్రం దీపాలు వెలిగించకుండా అమావాస్య చీకట్లోనే గడిపేస్తుందట.  గ్రామంలో ఇలా పండుగ సెలబ్రేట్ చేసుకోకపోవడానికి ఒక రీసన్ కూడా ఉందట. 200 ఏళ్ళ క్రితం దీపావళి, నాగుల చవితి రోజున పాము కాటు వల్ల ఊయాలలోని చిన్నారి, రెండు ఎద్దులు మరణించాయట. ఇక ఆ రోజు నుంచి గ్రామంలో నాగుల చవితి, దీపావళి పండుగను నిర్వహించుకోకూడదు అని గ్రామ పెద్దలు నిర్ణయించుగా.. ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతూ వస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: