ఐపీఎల్ కోసం.. ప్రాక్టీస్ మొదలుపెట్టిన ధోని.. వైరల్ వీడియో?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అభిమానులందరికీ కోరిక మేరకు అటు ఐపీఎల్లో మాత్రం కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా ఐపీఎల్ లో ధోని ప్రస్థానం ఎంత విజయవంతం గా సాగిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఏకం గా చెన్నై జట్టుకు నాలుగు సార్లు టైటిల్ అందించిన కెప్టెన్ గా దోని ప్రత్యేక మైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

 ఇకపోతే గత ఏడాది అటు ఐపిఎల్ లో దిగ్గజ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మాత్రం ఊహించని రీతిలో పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచింది. అయితే కెప్టెన్సీ విషయంలో జరిగిన మార్పులు చేర్పులు కూడా అటు జట్టు వైఫల్యానికి కారణమయ్యాయి అని చెప్పాలి. మొదట జడేజా కెప్టెన్సీ చేపట్టడం ఇక ఆ తర్వాత ఒత్తిడి తట్టుకోలేక ధోనీకి కెప్టెన్సీ అప్పగించడం లాంటివి జరిగాయి. ఇప్పుడు మరోసారి ధోని కెప్టెన్ గానే 2023ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది అన్నది తెలుస్తుంది.

 ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్ కోసం  మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పటినుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు అన్నది తెలుస్తుంది. ఝార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ నెట్స్ లో ధోని ప్రాక్టీస్ లో చెమటోడుస్తున్నాడు.. జార్ఖండ్ ఆటగాళ్లతో కలిసి ధోని నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. దాదాపు రెండు గంటలకంటే ఎక్కువ సమయం ధోని నెట్స్ లో ప్రాక్టీస్ చేశాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. అయితే గత ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచులలో కలిపి మహేంద్ర సింగ్ ధోని 232 పరుగులు చేసి పరవాలేదు అనిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: