రాహుల్ ద్రవిడ్ ముద్దుల ప్లేయర్.. మళ్లీ విఫలం?

praveen
మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఇక ఈనెల 23వ తేదీన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్తో మ్యాచ్ ద్వారా అటు టి20 ప్రపంచ కప్ లో ప్రస్థానాన్ని మొదలుపెట్టబోతుంది టీమిండియా.  ఈ క్రమంలోనే ఎక్కడ తప్పటడుగు వేయకుండా ఉండేందుకు ఆస్ట్రేలియా పిచ్ లపై అందరూ ఆటగాళ్లు అలవాటు పడేందుకు ప్రస్తుతం ప్రాక్టీస్ స్టేషన్లో టీమిండియా మునిగి తేలుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్లను ఆడుతుంది టీమిండియా. రెండు రోజుల క్రితం జరిగిన తొలి టీ20 ప్రాక్టీస్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించి అదరగొట్టింది అని చెప్పాలి.

 కానీ ఇటీవల జరిగిన రెండవ ప్రాక్టీస్ మ్యాచ్లో మాత్రం చివరికి ఓటమిపాలు అయింది. అది కూడా 36 పరుగుల తేడాతో ఓడిపోవడం గమనార్హం. ఈ మ్యాచ్ లో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేయలేదు.  మ్యాచ్లో మొదట బ్యాటింగ్  చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా  168 పరుగులు చేసింది. బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీశారు. బ్యాటింగ్ లో మాత్రం భారత జట్టు చేతులెత్తేసింది అని చెప్పాలి. కేఎల్ రాహుల్ 74 పరుగులు మినహా ఎవరు పెద్దగా రాణించలేదు. ముఖ్యంగా ఓపెనర్ గా వచ్చిన రిషబ్ 9 పరుగులు చేసి పెవీలియన్ చేరాడు.

 అంతకుముందు కూడా ఇలాగే నిరాశపరిచాడు రిషబ్ పంత్. ఎంతో బలహీనంగా ఉన్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలింగ్ కూడా పంతు ఎదుర్కోలేకపోయాడు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో రిషబ్ పంత్ రాహుల్ ద్రవిడ్  ముద్దుల ప్లేయర్ కావడం వల్లే అతనికి టి20 వరల్డ్ కప్ లో చోటు దక్కిందని.. అతనికి బదులు సంజు శాంసన్ ను తీసుకొని ఉంటే బాగుండేదని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాహుల్ ద్రవిడ్ చూపించిన వివక్షకు చివరికి మంచి ఫామ్ లో ఉండి టాలెంట్ ఉన్న సంజు శాంసన్  బలి అయ్యాడు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: