కోహ్లీతో సెల్ఫీ కోసం.. రూ.23,400 ఖర్చు పెట్టాడు?

praveen
విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్ లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఏ దేశానికి భారత జట్టు క్రికెట్ ఆడేందుకు వెళ్లిన అక్కడ కోహ్లీ అభిమానులు కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే స్టేడియంలో కోహ్లీ కి సంబంధించిన ఫ్లకార్డులు పట్టుకొని మ్యాచ్ లో బాగా రాణించాలి అంటూ మద్దతు తెలుపుతూ ఉంటారు అని చెప్పాలి. అంతలా తన ఆటతీరుతో అంతర్జాతీయ క్రికెట్లో హవా నడిపిస్తూ ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఇప్పటికే భారీగా పరుగులు చేసి ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ఇంకా పరుగుల దాహం తీరలేదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు అని చెప్పాలి.

 అయితే ఇక విరాట్ కోహ్లీని తమ జీవితంలో ఒక్కసారి కలిసిన చాలు అని అభిమానులు భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కోహ్లీని కలవడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడానికి అభిమానులు అస్సలు ఇష్టపడరు అన్న విషయం తెలిసిందే. కొంతమంది కాస్త రిస్క్ చేసి ఏకంగా మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో సెక్యూరిటీని దాటుకొని మైదానంలోకి పరుగులు పెడుతూ వచ్చి కోహ్లీని కలవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి.  లేదంటే ఇక టీమ్ ఇండియా ప్లేయర్లు ఎక్కడికైనా పయనం అవుతున్న సమయంలో అక్కడికి వచ్చి ఇక తమ అభిమాన క్రికెటర్లను కలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

 కానీ ఇక్కడ ఒక అభిమాని మాత్రం కోహ్లీతో సెల్ఫీ దిగేందుకు 23 వేల 400 రూపాయలు ఖర్చు పెట్టాడు. అదేంటి ఇంత ఖర్చు పెడితే కోహ్లీ సెల్ఫీ ఇస్తాడా అని అనుకుంటున్నారు కదా.. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య రెండవ టి20 మ్యాచ్ గౌహతి వేదికగా జరిగింది. ఈ క్రమంలోనే ఎయిర్పోర్టులో విరాట్ కోహ్లీతో ఫోటో దిగేందుకు ప్రయత్నించిన అభిమానులకు ఛాన్స్ దొరకలేదు. ఈ క్రమంలోనే ఒక అభిమాని వినూత్నంగా ఆలోచించాడు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ఉండే స్టార్ హోటల్లో 23,400 ఖర్చు పెట్టి ఒక రూమ్ అద్దెకు తీసుకున్నాడు. తద్వారా కోహ్లీ ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్లి ఒక సెల్ఫీ తీసుకొని తన కోరిక తీర్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: