ఆస్ట్రేలియా జట్టులో.. సింగపూర్ సిన్నోడు.. ఎలా రాణిస్తాడో?

praveen
ఐపీఎల్ మెగా వేలం సమయంలో ప్రేక్షకులు అందరి అంచనాలు తారుమారయ్యాయి. అన్ని జట్ల ఫ్రాంచైజీలు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న వారిని కొనుగోలు  చేసేందుకు ఆసక్తి చూపుతాయి అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కేవలం యువ ఆటగాళ్ల వైఫై మొగ్గు చూపాయి అన్ని ఫ్రాంచైజీలు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ జట్టు యువ ఆటగాడు టీమ్ డేవిడ్ కోసం 8.23 కోట్లు చెల్లించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. సీనియర్ ప్లేయర్ అయిన  ఆర్చర్ కి ఎనిమిది కోట్లు చెల్లిస్తే అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న సింగపూర్ చిన్నోడు టీమ్ డేవిడ్ 8.23 కోట్లు వెచ్చించడం పై పెద్ద చర్చ జరిగింది.

 సింగపూర్ లో జన్మించిన టీమ్ డేవిడ్ 2019లో తన సొంత దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 14 టి20 మ్యాచ్ లు ఆడాడు. అయితే ఇప్పుడు లీగ్ క్రికెట్ లో టీమ్ డేవిడ్ చూపించిన పర్ఫామెన్స్ కి ఫిదా అయిన క్రికెట్ ఆస్ట్రేలియా సెలెక్టర్లు అతని జాతీయ జట్టులోకి తీసుకున్నారు. ఒక వైపు బ్యాటింగులో మరోవైపు బౌలింగులో కూడా మెరుగైన ప్రదర్శన చేయడంతో అతనికి లక్కీ ఛాన్స్ దక్కింది. కాగా ఆస్ట్రేలియా ఇండియా పర్యటనకు వచ్చింది. దీంతో భారత్ తో టి20 సిరీస్ ఆడుతుంది.

 టీ20 సిరీస్ లో భాగంగా సింగపూర్ సిన్నోడు టీమ్ డేవిడ్ ఎలాంటి ప్రదర్శన చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్ లాంటి స్టార్ ప్లేయర్లు దూరం  కావడంతో ఆస్ట్రేలియా అంతర్జాతీయ జట్టులోకి యువ ఆటగాడు టీమ్ డేవిడ్ కు అవకాశం దక్కింది అని చెప్పాలి. అంతేకాదు టి20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో కూడా ఈ యువ ఆటగాడు స్థానం సంపాదించుకోవడం గమనార్హం. ఇకపోతే ఐపీఎల్లో ఇతన్ని 8.23 కోట్లు పెట్టి కొనుగోలు చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ యాజమాన్యం సరిగా వాడుకోలేక పోయింది అన్న విమర్శలు కూడా వచ్చాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: