పాకిస్తాన్ ఫస్ట్ రౌండ్ లోనే ఓడిపోతుంది.. షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్?

praveen
పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలకు కేంద్రబిందువు గా మారిపోతూ ఉంటాడు. ఈ క్రమంలోనే క్రికెట్లో టీమిండియా ఆటగాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు అటు పాక్ ఆటగాళ్ల తీరుపై కూడా విమర్శలు చేస్తూ ఉంటాడు షోయబ్ అక్తర్. ఇక పాకిస్థాన్ జట్టులో ఎవరు ఉండాలి.. ఎలాంటి ప్రదర్శన చేయాలి అనే విషయంపై ఎప్పుడు సలహాలు ఇచ్చే షోయబ్ అక్తర్ ఇటీవలే మాత్రం సంచలన వ్యాఖ్యలతో మళ్లీ వార్తల్లో నిలిచాడు.

 ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టి20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలు ప్రకటించింది. అయితే ఇలా ఎంపిక చేసిన జట్టుపై, సెలక్షన్ కమిటీ పైన కూడా తీవ్ర విమర్శలు గుప్పించాడు షోయబ్ అక్తర్. అటు ఆసియా కప్ కి సెలెక్ట్ చేసిన జట్టు కి వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేసిన జట్టుకు పెద్ద తేడా లేదు అంటూ చెప్పుకొచ్చాడు. మిడిల్ ఆర్డర్ లో   డెప్త్ లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ మిడిలార్డర్ చూసుకుంటే జట్టు ఫైనల్స్కు వెళ్లడం కాదు  మొదటి రౌండ్ లోనే  వెనక్కి తిరిగి వచ్చేలా కనిపిస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. రానున్న రోజుల్లో పాకిస్తాన్ జ్యోతి కష్టకాలం రాబోతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ జట్టు కంటే కాస్త మెరుగైన జట్టును ఎంపిక చేయాల్సిందని తెలిపాడు.

 ఆసియా కప్లో భాగంగా దారుణంగా విఫలమైన అదే పాకిస్థాన్ జట్టును మళ్లీ వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయడం ఏంటి అంటూ సెలెక్షన్ కమిటీని ప్రశ్నించాడు. జట్టులోకి ఎవరిని తీసుకోవాలి అనే విషయంపై సెలక్షన్ కమిటీ కనీస అవగాహన లేదా అంటూ ప్రశ్నించాడు. ఇకపోతే వరల్డ్ కప్లో భాగంగా అక్టోబర్ 23 వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.

టీ20 వరల్డ్‌కప్‌ పాక్ టీమ్:
బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హారిస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్ దిల్ షా, మొహమ్మద్ హస్నైన్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీమ్, నసీమ్ షా, షహీన్ షా ఆఫ్రిదీ, షాన్ మసూద్, ఉస్మాన్ ఖాదిర్.
రిజర్వ్ బెంచ్: ఫక్తర్ జమాన్, మొహమ్మద్ హారిస్, షానవాజ్ దహానీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: