ద్రవిడ్ ఐడియాని కాపీ కొట్టిన పాక్ కోచ్.. అందుకే సక్సెస్?

praveen
ప్రస్తుతం భారత జట్టు కోచ్గా కొనసాగుతున్న రాహుల్ ద్రావిడ్ మాస్టర్ మైండ్ అని చెబుతూ ఉంటారు ఎంతోమంది. అయితే ఆయనను మాస్టర్ మైండ్ అనడానికి ఆయన తీసుకునే నిర్ణయాలే కారణమని చెప్పాలి. మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా జరుగుతున్న సమయంలో మిగతా ఆటగాళ్ళందరూ ఒత్తిడిలో ఉన్నా టైం లో కూడా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఎంతో కూల్ గా  ఉంటూ అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు రాహుల్ ద్రవిడ్. ఒకప్పుడు భారత జట్టులో ఆటగాడిగా కొనసాగిన సమయంలో ఇక ఆ తర్వాత ఇప్పుడు జట్టు కి కోచ్ గా కొనసాగుతున్న సమయంలో కూడా ఇలాగే మాస్టర్ మైండ్ తో ఆలోచిస్తూ ఉంటాడు.

 ఇకపోతే ఇటీవల టీమిండియా ఆసియా కప్లో భాగంగా సూపర్ 4 లో  భాగంగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కోచ్ మాస్టర్ మైండ్ రాహుల్ ద్రావిడ్ ఆలోచన ను కాపీ కొట్టాడు అంటే ఒక వార్త వైరల్ గా మారిపోయింది.  భారత్ తమ ముందు ఉంచిన టార్గెట్ ను 19.5 ఓవర్లలో నే ఐదు వికెట్ల నష్టానికి చేధించింది పాకిస్తాన్ జట్టు. అయితే తొలి 10 ఓవర్లలో 73పరుగులు మాత్రమే చేయగా.. రెండు కీలకమైన వికెట్లు కూడా కోల్పోయింది పాకిస్తాన్.  ఇలాంటి సమయంలోనే పాకిస్థాన్ కోచ్ సక్లేన్ ముస్తాక్ ఒక ఆలోచన చేశాడు.

 రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేసాడు. రవి బిష్ణాయ్, చాహల్ లాంటివాళ్ళు బౌలింగ్ చేస్తున్న సమయంలో హార్డ్ హిట్టర్ నవాజ్ ను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేసి నాలుగో స్థానంలో ఆడించాడు. అంతకు ముందే బౌలింగ్ వేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చిన నవాజ్ ఒక వికెట్ తీశాడు. నవాజ్ ఇక అదే ఫామ్ను అటు బ్యాటింగ్ లో  కూడా నవాజ్ కొనసాగించాడు. దీంతో 20 బంతుల్లో 42 పరుగులు చేసి సిక్సర్లు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. తద్వారా పాకిస్తాన్ ఎంతో అలవోకగా గెలుపుకు చేరువైంది. కష్టాల నుంచి బయట పడింది. ఇక అటు క్లిష్టపరిస్థితుల్లో రాహుల్ ద్రవిడ్ కూడా ఇలానే చేస్తూ ఉంటాడు. అందుకే ద్రవిడ్ ఆలోచనను పాకిస్తాన్ కోచ్ కాపీ కొట్టాడు అని ఇండియన్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: