ఇదొక్క కారణం చాలు.. ద్రావిడ్ మాస్టర్ మైండ్ అనడానికి?

praveen
సాధారణంగా మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్గా ఉన్న సమయంలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో ఎన్నో మార్పులు వస్తూ ఉండేవి. పరిస్థితులకు అనుగుణంగా వెనక రావాల్సిన ఆటగాళ్లను ముందుగానే బ్యాటింగ్ కీ పంపించడం.. లేదా ముందు రావాల్సిన ఆటగాడని కాస్తవెనకాల బయటకు పంపించడం లాంటివి చేసేవారు మహేంద్రసింగ్ ధోని. ఇలాంటివి చేయడం ద్వారా మంచి ఫలితాలను రాబట్టవచ్చు అని చెప్పాలి. అందుకే మహేంద్ర సింగ్ ధోనీనీ మాస్టర్ మైండ్ అని పిలుస్తూ ఉంటారు. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాస్టర్ మైండ్ ప్లాన్ సక్సెస్ అయింది అని తెలుస్తోంది.

 మొదట బౌలింగ్ చేసిన భారత్ జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 19.5 ఓవర్లలో 147 పరుగులు చేసి ఆలౌటైంది పాకిస్తాన్.  అయితే ఇది అంత కష్టమైన లక్ష్యం ఏమీ కాదు. అయితే పాకిస్తాన్ లో షాహీన్ అఫ్రిది స్థానం లో  జట్టులోకి వచ్చిన నసీం షా భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. కె.ఎల్.రాహుల్ గోల్డెన్ డక్ చేశాడు
 కోహ్లీ కూడా వెంటనే అవుట్ కావాల్సింది. కానీ క్యాచ్ మిస్ చేయడంతో చివరికి బతికిపోయాడు. అయితే బాబర్ ఎంతో తెలివిగా రెండు వైపుల నుంచి స్పిన్నర్ల తో  దాడి చేయడంతో భారత్ పరుగుల కోసం తీవ్రంగా కష్టపడ్డారు..

 ఈ క్రమంలోనే రోహిత్ కూడా వికెట్ కోల్పోయాడు. ఇలాంటి సమయంలోనే కోచ్ రాహుల్ ద్రవిడ్ మాస్టర్ మైండ్ బయటపెట్టాడు.. స్పిన్నర్లు బౌలింగ్ చేస్తుండడంతో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా లను కాదని రవీంద్ర జడేజాను బ్యాటింగ్ కి పంపాడు. ఇక ఇదే విజయ రహస్యం అని చెప్పాలి.  లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బౌలింగ్లో భారీ షాట్లు ఆడాలంటే లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ ఉండాలని కోచ్ రాహుల్ ద్రావిడ్ భావించాడు. క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా సిక్సర్లతో పాకిస్తాన్ స్పిన్నర్ల దూకుడుకి చెక్ పెట్టాడు. 29 బంతుల్లో 35 పరుగులు చేశాడు ఇక ఈ ఒక్క మూవ్ రాహుల్ ద్రవిడ్ మాస్టర్ మైండ్ లో ఎలా  ఆలోచిస్తున్నాడు చూసుకోవచ్చు అని అంటున్నారు భారత అభిమానులు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: