వావ్.. బంతితో తికమక పెట్టి.. ఒంటి చేత్తో క్యాచ్ పట్టి?

praveen
సాధారణంగా పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రతి బౌలర్  కూడా ప్రయత్నిస్తూ  ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైవిధ్యమైన బంతులతో కొన్ని కొన్ని సార్లు ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్లను  లను సైతం తికమక పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా మంచి ఫాం లో ఉంటూ సిక్సర్లు ఫోర్లతో చెలరేగుతూ పరుగుల వరద పారిస్తున్న బ్యాట్స్మెన్లను బౌలర్లు తికమక పెట్టి వికెట్ దక్కించుకున్నారు అంటే అది కాస్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇటీవలే పాకిస్తాన్ నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న నామమాత్రమైనా  మూడో వన్డే మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది.

 వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయిన నెదర్లాండ్స్ జట్టు చివరికి పాకిస్తాన్ కు వన్డే సిరీస్ అప్పగించింది.. అయితే నామమాత్రమైనా మూడో వన్డే మ్యాచ్లో మాత్రం నెదర్లాండ్స్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. ఇంతకు ముందు నుంచి మంచి ఫాంలో కొనసాగుతున్న పర్యాటక పాకిస్థాన్ జట్టును 206 పరుగులకే ఆలౌట్ చేశారు. అయితే బాబర్ అజాం  ఒక్కడే 91 పరుగులతో రాణించాడు కాబట్టి పాకిస్తాన్ ఈ మేరకు స్కోరు చేయగలిగింది అని చెప్పాలి.  కాగా రీషెడ్యూల్ వన్డే సిరీస్ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రస్తుత నెదర్లాండ్స్ లో పర్యటిస్తూ ఉంది. ఇప్పటికే 2-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది పాకిస్తాన్.

 ఈ క్రమంలోనే వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ బాబర్ అజాం క్రీజ్లో పాతుకుపోయాడు. 125 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లు సహాయంతో 91 పరుగులు చేశాడు. కానీ 43 ఓవర్ నాలుగో బంతికి ఆర్యన్ దత్ అద్భుత బంతితో బాబర్ ను బోల్తా కొట్టించాడు. ఒంటిచేత్తో క్యాచ్ పట్టి పెవిలియన్ పంపించాడు. తద్వారా బాబర్ ఆజమ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు అని చెప్పాలి. ప్లాన్ ప్రకారం బంతిని సంధించగా అది ఎలా ఆడాలో తెలియక తికమక పడ్డాడు బాబర్. దీంతో డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా అది ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: