ఆ ఇద్దరిలా నేను బ్యాటింగ్ చేయలేను : రాహుల్ ద్రావిడ్

praveen
టీమిండియా క్రికెట్ చరిత్రలో లెజెండరీ క్రికెటర్ గా పేరు సంపాదించుకున్న కొద్దిమందిలో రాహుల్ ద్రవిడ్ కూడా ఒకడు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా రాహుల్ ద్రావిడ్ కి ప్రత్యేకమైన క్రేజ్ వుంది. టెస్టులు వన్డేల్లో 10,000 లకు పైగా పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు రాహుల్ ద్రవిడ్. ఇక టీమిండియా టెస్టు క్రికెట్లో ది వాల్ అనే బిరుదు కూడా సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇటీవల ఒక పాడ్ కాస్ట్ లో భాగంగా తన సహచర ఆటగాళ్లు అయిన వీరేంద్ర సెహ్వాగ్ సచిన్ టెండూల్కర్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు రాహుల్ ద్రావిడ్.

 ఈ క్రమంలోనే మాట్లాడుతూ నేను వెనక్కి తిరిగి నా కెరీర్ని చూసుకుంటే అది ఒక గేమ్ చేంజర్ గా అనిపిస్తూ ఉంటుంది. నా మెంటల్ ఎనర్జీని ఆటలో నేను పూర్తిగా ఉపయోగించుకో గలిగాను అనిపిస్తూ ఉంటుంది. మ్యాచ్ ఆడినప్పుడు కూడా ఆట గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉండేవాడిని.. అలా ఆలోచించడం వల్ల నా బ్యాటింగ్లో ఎలాంటి మార్పు రాదని నేను త్వరగానే అర్థం చేసుకోగలిగాను. అందుకే బ్యాటింగ్ విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. వ్యక్తిగత జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసేవాణ్ణి. నేను ఎప్పటికీ కూడా వీరేంద్ర సెహ్వాగ్ అంత వేగంగా పరుగులు చేయలేను అని అర్థమైంది. అతనికి దూకుడుగా పరుగులు చేసే తత్వం అతని పర్సనాలిటీ వల్ల వచ్చింది.

 కొన్నిసార్లు వీరేంద్ర సెహ్వాగ్ లాగే వేగంగా పరుగులు చేయాలని ప్రయత్నించా. కానీ వికెట్ కోల్పోయా.. ఇక అప్పుడు నా బ్యాటింగ్  మార్చుకోవాల్సిన అవసరం లేదు అనిపించింది. అదే సమయంలో సచిన్ టెండూల్కర్ లాగా సుదీర్ఘమైన కెరీర్ నేను కొనసాగించలేను అని తెలుసుకున్నాను. నాకు ఉన్నదల్లా ఓపికే. ఓపికను నా బలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్న అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే బౌలర్ల తో పోటీ పడుతూ ఎవరు ముందుగా అలసి పోతారో అని చాలెంజ్ కూడా చేసేవాడిని అంటూ రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: