పుజారా సూపర్ బ్యాటింగ్.. ఏకంగా 118 ఏళ్ళ తర్వాత?

praveen
భారత జట్టులో టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా గుర్తింపు సంపాదించుకున్నాడు  పూజారా. ఎంతో నెమ్మదిగా ఆడుతూ.. బౌలర్ల ఓపికకు పరీక్ష పెడుతూ ఉంటాడు అని చెప్పాలి. అదే సమయం లోఎక్కువ సమయం పాటు క్రీజులో ఉండి పరుగులు రాబట్టడం లో కూడా చటేశ్వర్ పుజారా దిట్ట అని చెప్పడం లో అతి శయోక్తి లేదు. ఇప్పటివరకు ఎన్నో సార్లు భారత జట్టును తన ఇన్నింగ్స్ తో గెలిపించాడు చటేశ్వర్ పుజారా. ఈ క్రమం లోనే టీమిండియా నయా వాల్ అంటూ పేరు కూడా సంపాదించుకున్నాడు.

 టీమిండియా ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ ఆడిన  పుజారా మాత్రం జట్టులో తప్పకుండా స్థానం సంపాదించుకుంటాడు అని చెప్పాలి. ఇకపోతే గత కొంత కాలం నుంచి ఫామ్ను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పూజారా మళ్ళీ మునుపటి ఫామ్ అందుకోవడం కోసం అటూ ఇంగ్లాండ్ కౌంటీలలో ఆడుతున్నాడు. ఈ క్రమం లోనే ససెక్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టాడు అన్న విషయం తెలిసిందే. ఒకవైపు జట్టును సమర్థవంతం గా ముందుకు నడిపిస్తూనే ఇక మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ అదర గొడుతున్నాడు.

 వరుసగా సెంచరీలు, డబుల్ సెంచరీ లతో చటేశ్వర్ పుజారా తన అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నాడు. ఇకపోతే ఇటీవలే కౌంటీ క్రికెట్ లో 118 ఏళ్ల రికార్డు బ్రేక్ చేశాడు పుజారా. మిడిల్సెక్స్ తో జరుగుతున్న మ్యాచ్లో పుజారా డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు. 403 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయం తో 231 పరుగులు చేశాడు. ఈ క్రమం లోనే 118 ఏళ్ల తర్వాత ఒక కౌంటి సీజన్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన తొలి సక్సెస్ ఆటగాడిగా పుజారా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. అయితే మొన్న ఇంగ్లాండ్ వేదిక టీమిండియా ఆడిన టెస్టు మ్యాచ్ లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: